Bamboo tree Vastu Tips : లక్కీ బాంబూ ప్లాంట్ ఏ దిశలో ఉండాలో తెలుసా..? గాజు పాత్రలోనే ఎందుకు నాటాలంటే..!
ABN, First Publish Date - 2023-04-22T11:38:02+05:30
వెదురు చెట్ల ఆకులతో టీ తయారుచేసుకుని తాగుతారు.
చైనా వెదురు చెట్టు, లక్కీ బాంబూ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్ తో కట్టి వుంటాయి. ఇవి చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు. ఇవి పంచడం కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ మొక్కలు రకరకాల ఆకృతులలో ప్రతి చోటా దొరుకుతూనే ఉంటాయి. అయితే వీని పెంచుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకుంటే..
ఈమొక్కలను ఇంటి అందాన్ని పెంచేవిగా అలంకరణగా కూడా ఉపయోగిస్తారు. ఇది మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినది. ఈమొక్కను వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతుందని నమ్ముతారు..
ఈ మొక్కలను ముఖ్యంగా గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ఇన్ డోర్ మొక్కలుగా పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడో తాజా ట్రెండ్ మొదలైంది. ఇళ్లల్లో పెంచుకుంటున్న ఈ మొక్కలను లక్కీ ప్లాంట్ గా చెబుతూ ఇవి పెంచుకుంటే ధన బలం పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ సంస్కృతి చాలావరకూ వ్యాపించటంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ, దుకాణల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలే కనిపిస్తున్నాయి. ఈ మొక్కలను చాలా సులువుగా పెంచొచ్చు. వీటికి మట్టి, ఎండతో అవసరం లేదు. కుండీలో నీటిని మాత్రం క్రమం తప్పకుండా మారుస్తే చాలు. అయితే నీరు మాత్రమే అవసరమైన ఇండోర్ ప్లాంట్స్ ను గాజు కుండీలలో పెంచితే ఇంటికి అందం మరింత పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: తులసి మొక్కకు రోజూ నీళ్ళు పోస్తున్నారా? అయితే చాలా నష్టపోతారు..!
వెదురు మొక్క (Bamboo)ను ప్రాణంలా చూసుకుంటారు జపాన్ ప్రజలు. మనకు వాస్తు ఎలాగో వాళ్లకు ఫెంగ్ షుయ్ అలా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం కలిసిరావాలంటే, వెదురు మొక్కను పెంచాలట. ఇలా ఒక మొక్కను ఇంట్లో పెంచితే విజయాలు సిద్ధిస్తాయట. అంతే కాదు ఈ మొక్కకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. గాలిలోని చెడు వాయువులు, మూలకాలను లాగేసుకుంటుంది. అందువల్ల ఇంట్లో వారికి మంచి ఆరోగ్యం అందించినట్టే..
అయితే వాస్తు ప్రకారం, ఈ వెదురు మొక్కను ఎక్కడబడితే అక్కడ ఉంచకూడదు. ఏ దిశలో వాటిని ఉంచాలో తెలుసుకుందాం.
వెదురు మొక్క ఎండిపోవద్దు
వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు ఎండిపోకూడదు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అటువంటి పరిస్థితిలో, వెదురు మొక్క ఎండిపోవడం ప్రారంభిస్తే, దానిపై శ్రద్ధ వహించాలి. మళ్లీ పచ్చగా మారకపోతే దాన్ని తీసేసి కొత్త మొక్క నాటాలి.
ఈ వెదురు మొక్కను తూర్పువైపున ఉంచాలి. దీనితో అదృష్టం, ఆనందం రెండూ కలుగుతాయి. వెదురు మొక్క కాలుష్యాన్ని తగ్గించడమే కాదు, దాన్ని చూసినప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని, మనసుకు హాయిని ఇస్తుంది. జపాన్ ప్రజలు వెదురు చెట్ల ఆకులతో టీ తయారుచేసుకుని తాగుతారు. ఈ చెట్టు ఆకులు ఔషధ గుణాలు కలిగివుంటాయి. అందువల్ల ఈ మొక్క ఉన్నచోట వ్యాధులు రావు. ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-04-22T11:38:02+05:30 IST