Surya grahanam : ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.. అయితే గ్రహణ ప్రభావం ఉన్న దేశాల్లోని భారతీయ హిందువులు ఈ సూచనలు పాటించండి..!
ABN, First Publish Date - 2023-04-20T14:44:14+05:30
సూర్యగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి. అయితే వీటి పట్టు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందరికీ తెలుసు. కానీ విడుపు తరవాత ఏంచేయాలి అనేది చాలామందికి తెలీదు. దీనికి ఏం చేయాలంటే.. సూర్యగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో కొన్ని అస్సలు చేయకూడని పనులుకూడా ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. సూర్య గ్రహణం అనేది అశుభంగా భావిస్తారు.
ఈ సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదు.
1. ఈ సమయంలో పూజలు చేయకూడదు.
2. అలాగే ఇదే సమయంలో శుభకార్యాలను కూడా చేయకూడదు.
3. దైవారాధన చేయాలి.
ఇది కూడా చదవండి: కొందరు నానా తంటాలు పడి బరువు తగ్గుతారు.. కానీ మళ్లీ పెరుగుతుంటారు.. తగ్గాక మళ్లీ బరువు పెరగకుండా ఉండాలంటే..
అలాగే గ్రహణం ముగిసిన తరవాత ఈ పనులు చేయాలి. ఏం చేయాలంటే..
4. సూర్య గ్రహణం ముగిసిన వెంటనే ఇంట్లోని తలసి మొక్కపై గంగాజలాన్ని చల్లాలి.
5. గ్రహణం పూర్తయిన తరువాత అన్ని గదుల్లోనూ గంగాజలాన్ని చల్లాలి.
6. ఇక గ్రహణం పూర్తయిన తరువాత తప్పక అంతా స్నానం చేయాలి.
7. నువ్వులు, శనగపప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయట.
8. సుచిగా దేవాలయ దర్శనం చేసుకోవలి.
Updated Date - 2023-04-20T14:44:41+05:30 IST