Ghee or Oil: నెయ్యి వాడాలా..? లేక నూనె వాడాలా..? పూజ గదిలో దీపానికి అసలు ఏది వాడితే మంచిదంటే..!
ABN, First Publish Date - 2023-06-26T12:24:22+05:30
దేవతల పూజలో ఎప్పుడూ నెయ్యి దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి.
ఇంట్లో దీపం వెలిగించడం అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటి పరిసరాల్లో, వ్యక్తుల్లో పాజిటివ్ ఎనర్జీని అందించడమే కాకుండా భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఆనందాన్ని, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. దురదృష్టం లేదా 'వాస్తు దోషాన్ని అంతం చేయడానికి దీపం సహకరిస్తుంది. దీపం వెలిగించడం అనేది అన్ని మతపరమైన ఆచార, ఆరాధనలో అంతర్భాగం. దైవాన్ని ప్రార్థించడంతో పాటు ఇంటిని ప్రశాంతగా ఉంచే శుభప్రదమైన పద్ధతి.
అయితే, ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె, నెయ్యి రెండింటిలో ఏది మంచిది అనే విషయంలో మీమాంస పడుతూ ఉంటారు. ఏది మంచిది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తప్పక తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు తక్షణ సమాధానం నెయ్యి, నూనె రెండింటినీ ఉపయోగించవచ్చు, కానీ అవి రెండూ వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి.
నెయ్యి Vs నూనె
మత విశ్వాసాల ప్రకారం, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఏవైనా నెరవేరని కోరికలు ఉంటే, దానికి గాను నూనె దీపాన్ని వెలిగించాలి. మరోవైపు, దేవతల పూజలో ఎప్పుడూ నెయ్యి దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి.
ఇది కూడా చదవండి: పొద్దున్నే నిద్రలేచిన వెంటనే.. అరచేతుల్ని చూసుకునే అలవాటుందా..? చాలామందికి తెలియని నిజమేంటంటే.!
నిర్దిష్ట ప్రయోజనాల కోసం నెయ్యి, నూనె కాకుండా..
1. నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
2. శని అననుకూలత, చెడు ప్రభావాలను పారద్రోలాలని కోరుకుంటే, ఆవనూనెతో వెలిగించిన దీపం అత్యంత ప్రయోజనకరమైనది. అంతేకాదు, సూర్య భగవానుడు, కాల భైరవుడిని శాంతింపజేయడానికి, ఆవనూనె దీపం మంచిది.
3. హనుమంతునికి భక్తిని తెలియజేయడానికి, మల్లె నూనెతో మూడు మూలల దీపాన్ని వెలిగించవచ్చు.
4. జాతకంలో రాహు, కేతువుల అననుకూల స్థానాలు ఉంటే, వారి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి అవిసె గింజల నూనె దీపాన్ని వెలిగించడం ప్రయోజనకరంగా ఉంటుందట.
5. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ దీపం వెలిగించే విధానం అనేది పరిసరాలలోని సాధారణ శక్తులను మెరుగుపరచడానికి, శుద్ధి చేయడానికి సహాయపడుతుంది.
Updated Date - 2023-06-26T12:27:12+05:30 IST