ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indoor Plants: వీటిని ఇంట్లో పెంచుతున్నారా? అయితే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే..!

ABN, First Publish Date - 2023-03-27T10:02:13+05:30

మన దేశంలో మరణ సమయాల్లో వాడుతుంటారు కనుక వాస్తు అపశకునంగా భావిస్తారు.

Indoor Plants,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మొక్కలు పెంచడం అనేది ప్రతి ఒక్కరికీ నచ్చే విషయం. కాస్త ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకోవడం తప్పులేదు కదా. అయితే పెద్ద పెరళ్లు, మొక్కలు పెంచేందుకు ఇంటి ముందు బాల్కనీలు లేనివారు మరి మొక్కలు పెంచుకోవాలంటే ఎలా.. ఈ మధ్యకాలంలో మొక్కల్ని అందరూ ఇళ్ళల్లో కూడా పెంచుతున్నారు. అంతే కాదు బాల్కనీలో పెంచే మొక్కలు మాదిరిగానే పెద్దగా సూర్యరశ్మి లేకపోయినా బ్రతికేసే మొక్కలను ఎంచుకుని మరీ మొక్కలను పెంచుకుంటున్నారు. వీటిని ఇంటీరియల్ ఫ్లాంట్స్ గా పిలుస్తున్నారు. అయితే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేది తెలుసుకోకుండానే హాల్లో పెట్టుకుని మురిసిపోతున్నారని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇలా ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే, దురదృష్టానికి స్వాగతం పలికినట్లేనట. వాస్తులో ప్రకారం ఏ మొక్కలతో ఏ చిక్కులు వస్తాయో తెలుసుకుందాం.

కాక్టస్

వాస్తు లేదా ఫెంగ్ ష్యూయి ఎక్స్పర్ట్స్ కాక్టస్ మొక్కలు అందంగా కనిపిస్తాయి. కానీ అవి ఇంటిలోకి బ్యాడ్‌లక్‌ని ఆహ్వానిస్తాయి. ఈ మొక్కల్లో ఉండే పదునైన ముళ్లు నెగెటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయని ఒక నమ్మకం. ఇవి పెట్టుకుంటే ఇంటిలోకి దృరదృష్టాన్ని ఆహ్వానించినట్లే. ఇవి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయట. ఇంట్లో మనశ్శాంతి నశిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాక్టస్ ఇంట్లో ఉండనే కూడదని కాదు. కానీ, సరైన స్థానంలో దీన్ని ఉంచితే మేలు జరుగుతుంది. టెర్రాస్ మీదో లేక కిటికిలోనో పెడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయి. ఒకరకంగా అవి ఇంటికి కాపాలాగా ఉండే రక్షణ కవచాలు.

బోన్సాయ్

బోన్సాయ్ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాస్తు నిపుణులు ఇవి ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిదని అంటున్నారు. ఇవి పెరుగుదల నిరోధకానికి గుర్తులు. జీవన గమనంలో ఆటంకాలు ఏర్పరుస్తాయి. ముందుకు సాగడంలో అడ్డంకులకు కారణం కావచ్చు. అయితే వీటిని ఓపెన్ ప్లేసుల్లో పెంచుకోవడం మంచిది.

పత్తి చెట్టు

పత్తి మొక్కలు, సిల్క్ కాటన్ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి అంత మంచివి కాదు. ఈ తెల్లని అందమైన మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఇవి వాస్తుపరంగా అంత మంచివి కాదునే నిపుణులు సలహా ఇస్తారు. వీటిని ఇంటిలోపల పెట్టుకుంటే చాలా అన్ లక్కీ అట.

గోరింటాకు చెట్టు

గోరింటాకు చెట్టు దుష్టశక్తులను ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి మొక్కల్లో చింత చెట్టు కూడా ఒకటి. దీన్నీ కూడా ఇంట్లో పెట్టుకూడదు. చింత చెట్టు పక్కన ఇంటి నిర్మాణం కూడా కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

చనిపోయిన మొక్కలు

ఎటువంటి మొక్కలైనా సరే వాడి పోయి ఎండిపోయి కనిపించినా అవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇంట్లో ఉండే మొక్కలు పచ్చగా అందంగా కనిపించవచ్చు. అందుకే ఇంట్లో పెంచుకునే మొక్కలు పచ్చగా తాజాగా ఉండేలా జాగ్రత్త పడాలి. చచ్చిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు చెడుకు సంకేతాలు. కనుక వెంటనే తీసేయ్యాలి.

ఇది కూడా చదవండి: ఈ గింజల్ని పూజగదిలో ఉంచితే.. అదృష్ణం, ఐశ్వర్యం వెతుక్కుంటూ వస్తాయట..!

ఇంట్లో పెట్టుకోకూడని మరికొన్ని మొక్కలు

1. ఖర్జుర చెట్టు.. ఈ చెట్టు చాలా సులభంగా పెరుగుతుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి.

2. వెదురు చెట్టు.. వెదురు మొక్క ఇంట్లో పెట్టుకోవడం ఫెంగ్ ష్యూయి ప్రకారం చాలా లక్కీ. కానీ వీటిని మన దేశంలో మరణ సమయాల్లో వాడుతుంటారు కనుక వాస్తు అపశకునంగా భావిస్తారు.

3. తుమ్మ చెట్టు.. ముళ్లుండే చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయట.

ఇంట్లో మొక్కులు పెంచడానికి ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ఎలాంటి మొక్కలు మంచివో తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది.

Updated Date - 2023-03-27T10:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising