Marriage: పెళ్లిలో వధువుతో అలా ఎందుకు చేయిస్తారు..? హిందూ పెళ్లిళ్లలో కామన్‌గా కనిపించే ఈ ఆచారం వెనుక..!
ABN, First Publish Date - 2023-07-17T16:13:33+05:30
వివాహంలో నమ్మకం, విశ్వాసంతో పాటు శాస్త్రీయమైన అంశాలు కూడా ముడిపడి ఉంటాయి.
పెళ్ళి తంతు ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. అయితే కొన్ని సాంప్రదాయ పద్దతులు కొన్నిచోట్ల ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా వధువు అప్పగింతల్లో పెళ్ళిళ్ళల్లో కామన్‌గా కనిపించే తంతు అదే ఆచారం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందట అదేమిటంటే..పెళ్ళి అనగానే ఇద్దరు జీవిత భాగస్వాములు కావడానికి సిద్ధం కావడమేకాదు రెండు కుటుంబాల కలయిక. అలాంటి వివాహంలో తరాల నుంచే సంక్రమించిన సాంప్రదాయాలను, ఆచారాలను కొనసాగిస్తూ జరిగే తంతు. వివాహంలో నమ్మకం, విశ్వాసంతో పాటు శాస్త్రీయమైన అంశాలు కూడా ముడిపడి ఉంటాయి.
కొన్ని చోట్ల పెళ్ళి తర్వాత వధూవరులకు పసుపు రాయాడం, అగ్ని సాక్షిగా వ్రతాలు చేయడం వంటి వాటితో బాటు., వీడ్కోలు సమయంలో వధువు చేత బియ్యం విసిరే ఆచారం కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు ఇది చాలా భావోద్వేగ సమయం. ఎందుకంటే దీని తర్వాత ఆ అమ్మాయి తన పుట్టినింటిని వదిలి శాశ్వతంగా అత్తింటికి వెళుతుంది. హిందూ వివాహాల్లో ఇలా జరగడం దాదాపు అందరూ చూసి ఉంటారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే అప్పగింతలప్పుడు బియ్యం విసిరే ఆచారం ఉంటుంది. పద్దతి ఎందుకు చేస్తారో, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
బియ్యం పెట్టే వేడుక ఎలా ఉంటుంది.
వధువు తన పుట్టిన ఇంటిని విడిచిపెట్టి, అత్తమామల ఇంటికి బయలుదేరే సమయంలో, వధువు బియ్యం విసిరే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో కొత్త పళ్ళెం బియ్యాన్ని వధువు తన రెండు చేతులతో బియ్యాన్ని తీసుకొని ఆమె తలపై వెనుకకు విసిరేయాలి. ఇలా ఐదుసార్లు వెనక్కి తిరిగి చూడకుండా చేయాలి. ఈ సమయంలో, అమ్మాయి తల్లి, ఇతర మహిళలు తమ పైకి విసిరిన బియ్యాన్ని కింద పడకుండా పట్టుకుంటారు. తర్వాత ఇంట్లో ఈ బియ్యాన్ని భద్రంగా ఉంచుతారు.
ఇది కూడా చదవండి: పచ్చి ఉల్లిపాయలను తింటే ఏమవుతుందిలే అనుకుంటున్నారా..? ఈ నిజాలు తెలిస్తే..!
బియ్యం పెట్టే ఆచారం ఎందుకు చేస్తారు?
హిందూ మతంలో, ఆడపిల్లలను సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. వివాహం తర్వాత తన పుట్టిన ఇంటిని విడిచిపెట్టినప్పుడు, ఆమె తన ఆశీర్వాదాలను, సంపదను, తన కుటుంబానికి శ్రేయస్సును ఇస్తూ బియ్యం రూపంలో వదిలివేస్తుంది. అందుకే ఈ బియ్యం బాగా నిల్వ ఉంటాయి. ఇది కాకుండా, కన్యను చెడు కన్ను నుండి రక్షించడానికి వధువు తన తలపై బియ్యం విసిరిస్తారు. ఈ ఆచారం అర్థం ఏమిటంటే, వధువు తన కుటుంబం నుండి ఇప్పటివరకు తనకు లభించిన ప్రేమ, గౌరవం అన్ని ఆనందాలకు తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
పెళ్లిళ్లలో మాత్రమే బియ్యం ఎందుకు వేస్తారు?
భారతీయ ఆహారంలో బియ్యం ప్రధాన భాగం. దాని ప్రాథమిక జీవనాధార లక్షణాల కారణంగా, అన్నం శుభం, శ్రేయస్సు, సంతానోత్పత్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూలతను దూరంగా ఉంచుతుందని నమ్ముతారు, కాబట్టి వివాహం, పూజతో సహా అన్ని శుభ కార్యక్రమాలలో బియ్యాన్ని ఉపయోగిస్తారు.
Updated Date - 2023-07-17T16:13:33+05:30 IST