Raksha Bandhan 2023: రాఖీ పండుగ రెండు రోజులు ఎందుకు..? ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాదే ఎందుకిలాగంటే..!
ABN, First Publish Date - 2023-08-29T16:30:15+05:30
ఈ ఏడాది భద్ర కాల, పౌర్ణమి తేదీలు కలిసి రావడంతో ఈ రెండు తేదీలతో గందరగోళం నెలకొంది.
రాఖీ పండుగ తోబుట్టువులందరి పండుగ. అన్నదమ్ముల శ్రేయస్సుకోరి జరుపుకునే అందమైన పండుగ. తోబుట్టువులు, అక్కచెల్లెళ్లు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుందని నమ్ముతారు. మరి ఈ సంవత్సరం రఖీ పండుగ పెద్ద గందరగోళంలో పడింది. తగులు మిగులు పండుగగా రాఖీ పండుగ రావడంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు.
రక్షా బంధన్ పండుగ రోజున తోబుట్టువుల చేతులకు రాఖీ కట్టడం, తోబుట్టువుల మధ్య విడదీయరాని బంధాన్ని నిలుపుతుందని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శుక్ల పక్షంలోని పూర్ణిమ తిథి, పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది. అయితే ఈ ఏడాది కరెక్ట్ డేట్ ఎప్పుడెప్పుడా అని సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. రక్షా బంధన్ ఆగస్టు 30నా లేక 31వ తేదీనా.. లేక రెండు రోజులూ జరుపుకోవచ్చా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: పరగడుపునే నెయ్యిని ఎందుకు వాడకూడదు.. ఆయుర్వేదంలో ఉన్న అసలు నిజాలేంటంటే..!
రక్షా బంధన్ 2023ని రెండు రోజులు ఎందుకు?
ఈ ఏడాది భద్ర కాల, పౌర్ణమి తేదీలు కలిసి రావడంతో ఈ రెండు తేదీలతో గందరగోళం నెలకొంది. దృక్ పంచాంగ్ ప్రకారం, పూర్ణిమ తిథి ఆగస్టు 30 ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. ఇదిలా ఉండగా, రాఖీ సమయం సాయంత్రం 5:30 నుండి 6:31 వరకు ఉంటుంది. భద్ర ముఖా సాయంత్రం 6:31 గంటలకు ప్రారంభమై రాత్రి 8:11 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9:01 గంటలకు భద్ర కాలం ముగుస్తుంది.
రక్షా బంధన్ రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం రాత్రి 9:01 తర్వాత. కానీ చాలామంది రక్షా బంధన్ రాత్రిపూట చేయకూడదు. కాబట్టి, ఆగస్టు 30 రాత్రి (రాత్రి 9:01 గంటల తర్వాత) లేదా ఆగస్టు 31న రాఖీ కట్టవచ్చు.
Updated Date - 2023-08-29T16:30:15+05:30 IST