ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devotional Secret: బంతిపూలను దేవుడి కోసం ఎందుకు వాడరు..? అసలు ఏఏ పూలను పూజకు వాడరంటే..!

ABN, First Publish Date - 2023-07-26T15:38:23+05:30

పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను దేవునికి సమర్పించాలి.

Lord Vishnu

భక్తితో పూజించేవారికి దేవుడి దయ తప్పక ఉంటుంది. దీనికోసం ఉదయం, సాయంత్రం పూలతో పూజ చేస్తారు చాలామంది. అయితే పూలతో పూజ చేసినప్పుడు ఏరకం పూలను ఉపయోగించాలనే విషయం చాలామందికి తెలియదు. అప్పటికి దొరికినవాటితో పూజ చేసేస్తూ ఉంటారు. కానీ పూజ చేసే విధానంలో కొన్ని రకాల పూలను మాత్రమే వాడాలట. అన్ని పూలూ పూజలకు పనికిరావు. ఏ రకం పూలతో పూజ చేయకూడదంటే..

పూజ చేయడానికి పనికిరాని పూలలో ముఖ్యంగా మొగలిపువ్వు ఒకటి. దీనికి కారణం కూడా లేకపోలేదు. మొగలి పువ్వును ఎందుకు పూజించకూడదో ఒక పురాణం కథ కూడా ఉంది. అదేమిటంటే.. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్పా అని వాదించుకున్నారు. దీనిని తేల్చేందుకు శివుడు వీళ్ళిద్దరికీ పరీక్ష పెట్టాడు.

తన శివలింగానికి ఆద్యంతాలు ( అంచులు ) కనుక్కొని రమ్మన్నాడు. ఈ పరీక్షకు సరేనన్న బ్రహ్మ, విష్ణులు శివలింగం అంచులు కనుక్కునేందుకు బయలుదేరి వెళ్ళారు. అయితే ఎంత దూరం ప్రాణించి వెళ్ళినా శివలింగం అంచులు కనిపించలేదు. బ్రహ్మకు దేవలోకంలో గోవు, మొగలి చెట్టు కనిపించాయి. ఎంత దూరం ప్రయాణించినా తనకు కనుక్కోవడం కుదరదని అర్థం చేసుకున్న బ్రహ్మ మొగలి చెట్టును, గోవును తను ఆద్యంతాలు కనుక్కున్నాననే విషయంగా అబద్దం చెప్పమంటాడు.

అక్కడకు వచ్చిన విష్ణుమూర్తి ఓడిపోయాడని, బ్రహ్మనే విజేతగా ప్రకటిస్తాడు శివుడు. ఇదంతా చూస్తున్న ఆకాశవాణి బ్రహ్మ అబద్ధం చెప్పించాడని, దానికి సరేనని మొగలి పువ్వు, గోవు అబ్బద్ధం చేప్పాయని విషయాన్ని వివరిస్తుంది. దీనికి ఆగ్రహించిన శివుడు మొగలి పువ్వు పువ్వు పూజకు పనికిరాదని, గోవు ముఖాన్ని చూస్తే పాపమనే శాపాన్ని ఇస్తాడు. అందుకే ఏ పూజలలోనూ మొగలిపూవ్వును పూజించేందుకు వాడం. అలాగే గోవును ముఖాన్ని కాక వెనుక వైపు నమస్కరిస్తూ ఉంటాం.


ఇది కూడా చదవండి: జిమ్‌లో వర్కవుట్స్ చేసేటప్పుడు.. ఈ 5 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా..!

మొగలిపువ్వు సున్నితత్వం కలిగి ఉండదు. చాలా ఎక్కువ వాసనతో, వెగటుగా తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఇది ఉన్నచోట అనుకూల శక్తి ఉన్నట్టు తోచదు. ముఖ్యంగా ఈ పూల పొదలున్నచోట పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువ వాసన వేసే సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజల్లో వాడరు. వీటితో పూజ చేయడం తక్కువ. బంతిపూలు కూడా పూజకు ఉపయోగించరు. ఇది క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి ఉంది.

పూజకు పనికిరాని పూలు, అసలు పూలు ఎప్పుడు కోయకూడదంటే..

1. పురిటివారు, మైలవున్నవారు, బహిష్టులైన పూలను తాకరాదు.

2. నేల మీద రాలిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమచేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజలో వాడరాదు.

3. పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను దేవునికి సమర్పించాలి.

4. అయితే బిల్వ పత్రాలు, తులసీ దళాలకు ఈ నియమాలు వర్తించవు.

Updated Date - 2023-07-26T15:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising