ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Young Heroes : యంగ్‌ హీరోల రేంజ్‌ పెరిగింది

ABN, First Publish Date - 2023-04-16T03:20:55+05:30

చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న హీరో.. పెద్ద హీరో.. వీటి మధ్య అంతరం క్రమంగా తగ్గిపోతోంది. ఇది వరకు చిన్న సైజు హీరో సినిమా అంటే రూ.10 కోట్లలో పూర్తయిపోవాల్సిందే. మహా అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న హీరో.. పెద్ద హీరో.. వీటి మధ్య అంతరం క్రమంగా తగ్గిపోతోంది. ఇది వరకు చిన్న సైజు హీరో సినిమా అంటే రూ.10 కోట్లలో పూర్తయిపోవాల్సిందే. మహా అయితే.. రూ.15 కోట్లు. ఇప్పుడు అలా కాదు. బడ్జెట్లు పెరుగుతున్నాయి. వాళ్ల పారితోషికాలూ...పరుగులు పెడుతున్నాయి. కొత్త హీరోలతో సినిమా అంటే నిర్మాతలు గీచి గీచి ఖర్చు పెట్టేవారు. వాళ్ల మార్కెట్‌కి తగ్గట్టుగాపై వనరులు అందించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. మార్కెట్ల గేట్లు తెరుచుకొన్నాయి. కథ బాగుంటే, కచ్చితంగా చిన్న, పెద్దా తేడా చూడడం లేదు. క్వాలిటీ కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. యూత్‌ హీరోలకు ఎంతైనా పారితోషికాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. చిత్రసీమలో ఇదో కొత్త పరిణామం.

కిరణ్‌ అబ్బవరం ట్రాక్‌ రికార్డు చూస్తే.. అన్నీ చిన్న సినిమాలే. తన తొలి చిత్రం ‘రాజావారు.. రాణీగారు’ చిత్రం కోటి రూపాయల లోపే పూర్తయ్యింది. ఆ తరవాత నాలుగైదు సినిమాలు చేశాడంతే. ఇప్పుడు పాతిక కోట్ల రేంజ్‌ హీరో అయిపోయాడు. తన తాజా చిత్రం ‘మీటర్‌’కు రూ.20 కోట్లకుపైగానే ఖర్చు పెట్టారని టాక్‌. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది కానీ, హిట్టయితే.. తన సినిమాలన్నీ రూ.25 - 30 కోట్ల చుట్టూ తిరిగేవి. విశ్వక్‌సేన్‌ దర్శక నిర్మాతగా చేసిన ప్రయత్నం ‘దాస్‌ కా ధమ్కీ’. ఈ చిత్రానికి దాదాపుగా రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది విశ్వక్‌ సొంత సినిమా కాబట్టి, తనపై తాను నమ్మకంతో ఇంత పెట్టుబడి పెట్టగలిగాడు. ‘కార్తికేయ 2’ అనూహ్యమైన విజయాన్ని అందుకొన్నాడు నిఖిల్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఘన విజయాన్ని అందుకొంది. ఆ సినిమాపై దాదాపుగా రూ.35 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకంత రాబట్టుకోగలిగింది కూడా. ఆ సినిమాతో నిఖిల్‌ కథల బడ్జెట్లు పెరుగుతున్నాయి. తనపై రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. నానినే తీసుకోండి. తనపై రూ.40 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. ‘అమ్మో..’ అనేవారు. ‘దసరా’కి రెట్టింపు బడ్జెట్‌ అయ్యింది. అయితేనేం.. వంద కోట్లు రాబట్టగలిగాడు. బడ్జెట్‌ అనేది కథ స్థాయిని బట్టి ఉంటుందని నిరూపించగలిగాడు. అఖిల్‌ తన తొలి సినిమాకే రూ.40 కోట్లు ఖర్చు పెట్టించాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. అయితే.. అఖిల్‌ రేంజ్‌ ఏం మారలేదు. ఇప్పుడు ‘ఏజెంట్‌’ కోసం ఏకంగా రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ సినిమా హిట్టయితే.. అఖిల్‌ సైతం వంద కోట్ల హీరో అయిపోతాడని ట్రేడ్‌ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.

పద్ధతిగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు... అడవి శేష్‌. సినిమా సినిమాకీ తన రేంజ్‌, స్టైల్‌.. దాంతో పాటుగా బడ్జెట్లు పెరుగుతూ వెళ్తున్నాయి. ‘క్షణం’ చిన్న సినిమా. పరిమిత బడ్జెట్‌లో తీశారు. ఆ సినిమా హిట్టయ్యింది. దాంతో ఒక్కో సినిమాకీ బడ్జెట్‌ పెరుగుతూ పోయింది. ఇటీవల వచ్చిన ‘మేజర్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో ఆడింది. ఇకపై శేష్‌ కూడా ఏమాత్రం చిన్న హీరో కాడు. తనపై కోట్లు గుమ్మరించడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చేస్తున్నప్పుడు నవీన్‌ పొలిశెట్టి అంటే ఎవరికీ పెద్దగా తెలీదు. ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకొంది. ఆ వెంటనే వచ్చిన ‘జాతిరత్నాలు’ మరో అనూహ్యమైన హిట్‌. నిర్మాత రూపాయి పెడితే, నాలుగు రూపాయల లాభం వచ్చింది. ఇలాంటి హీరోలే కదా.. టాలీవుడ్‌కి కావాల్సింది. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌లో అనుష్కతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ దాదాపు రూ.40 కోట్లు. జాతిరత్నాలు చిత్రానికి పెట్టుబడితో పోలిస్తే.. పదిరెట్లు ఎక్కువ. ఒకప్పుడు హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉండేది. ఇప్పుడు అనూహ్యంగా హీరోలకూ కొరత వచ్చింది. సినిమాల నిర్మాణం విపరీతంగా పెరగడం, వెబ్‌ సిరీస్‌ల హవా ఎక్కువగా ఉండడంతో... హీరోలు దొరకడం లేదు. దొరికినా వాళ్ల స్థాయికి మించిన పారితోషికాలు డిమాండ్‌ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నా, హీరోల కాల్షీట్లు అందుబాటులో ఉండడం లేదు. ఓటీటీ, శాటిలైట్‌ వల్ల పెట్టుబడిలో సగం తిరిగి వస్తుందన్న ధీమా నిర్మాతలకు గట్టిగా ఉంది. అందుకే 50- 50 రిస్క్‌తో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. కథ బాగుండి, కాంబినేషన్‌పై నమ్మకం కుదిరితే.. ఎంతైనా గుమ్మరిస్తున్నారు. ఈ పోకడ చూస్తుంటే.. త్వరలోనే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే అంతరం పూర్తిగా తొలగిపోతుందేమో అనిపిస్తోంది. ఇకపై కంటెంట్‌ ఉన్నదే పెద్ద సినిమా.

Updated Date - 2023-04-16T03:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising