కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

cream boxes : వాడేసిన ప్రతి వస్తువునూ మరోలా ఉపయోగించుకోవచ్చని తెలుసా.. అయితే ఈ సీసాలతో కొత్తగా ట్రై చేయండి.. మరి.

ABN, First Publish Date - 2023-10-20T11:19:31+05:30

ఇన్ని విధాలుగా ఉపయోగపడే గుమ్మడికాయ గింజలు కూడా ఆరోగ్యానికి మంచివనే విషయం ఎందరికి తెలుసు.

cream boxes : వాడేసిన ప్రతి వస్తువునూ మరోలా ఉపయోగించుకోవచ్చని తెలుసా.. అయితే ఈ సీసాలతో కొత్తగా ట్రై చేయండి.. మరి.
empty box

కూల్ డ్రింగ్ తాగామా, ఆ బాటిల్ ఎక్కడో చెత్తలో పడేస్తూ ఉంటాం. పార్సిల్ అందుకున్నామా ఆ అట్టపెట్టెను చెత్తలోకి తోసేస్తాం. కానీ వీటితో కూడా అద్భుతాలు చేసేవారున్నారు. కాదేదీ రీసైకిలింగ్ కు అనర్హం అనే టైటిల్ కి సరిగ్గా న్యాయం చేస్తున్నారు. ఖాళీ వాటర్ బాటిల్స్ తో మొక్కలు పెంటడం, అలాగే ఫ్లవర్ వాజ్ లా కట్ చేసి అందంగా అలంకరించడం, అట్టపెట్టెలతో రకరకాల ఆకృతులు తయారు చేయడం ఇలాంటి వాటితో వీడియోలు చేసి కూడా పాపులర్ అవుతున్నవారున్నారు. అయితే ఇప్పుప్పు ఇంకాస్త కొత్తగా ఫేస్ క్రీమ్ బాటిల్స్ తో ఏం చేయచ్చో చూద్దాం.

మామూలుగా ఏ వస్తువైనా మరో రూపంలో మనకు ఉపయోగపడుతుంది. అయితే మనం అంతగా దృష్టి పెట్టి మరీ ఆలోచించం కానీ.. ప్రతి వస్తువును మరో రూపంలోకి మార్చి వాడుకోవచ్చు. చాలావరకూ మనం వాడని, తిరిగి ఉపయోగించని వస్తువుల్లో ముఖానికి వాడే క్రీమ్ సీసాలు కూడా ఒకటి. సాధారణంగా, ముఖానికి రాసుకున్న క్రీం అయిపోయినప్పుడు, దాన్ని వృధాగా సీసాను పారేస్తాము. అయితే ఈ సీసాతో ఏం చేయచ్చో చూడండి.

ఇది కూడా చదవండి: మగాళ్లూ.. జర జాగ్రత్త.. ఈ సమస్యను లైట్ తీసుకుంటే పిల్లలు పుట్టే ఛాన్సులపై ఎఫెక్ట్..!

క్రీమ్ కంటైనర్లను ఎలా తిరిగి ఉపయోగించాలి.

ఖాళీ క్రీమ్ కంటైనర్‌లో బోన్సాయ్ మొక్కను నాటవచ్చు. వీటిని వంటగదిలో ఉంచుకోవచ్చు. లేదా మనీ ప్లాంట్‌ను నాటవచ్చు. రంగులతో కూడా పెయింట్ చేయవచ్చు. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. చిన్న చెవిపోగులు, బటన్లను ఖాళీ పెట్టెలో ఉంచవచ్చు. చిన్న వస్తువులను సులభంగా దాచుకోవచ్చు. ఈ చిన్న సీసాలను ప్రయాణంలో తీసుకెళ్లవచ్చు, ఈ కంటైనర్లలో మళ్లీ క్రీమ్ను నిల్వ చేయవచ్చు.. పొడిని కూడా ఉంచవచ్చు. ఇది కాకుండా, ఆఫీస్ కి తీసుకెళ్లడానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంచుకోవచ్చు. చిన్న సైజ్ ఫ్లవర్ వాజ్ గా క్రీమ్ కంటైనర్‌ను కొత్తగా తయారుచేసి మురిసిపోండి.

Updated Date - 2023-10-20T11:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising