ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Operation Kaveri: సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 392 మంది భారతీయులు!

ABN, First Publish Date - 2023-04-28T20:29:14+05:30

అంతర్యుద్ధంలో కూరుకుపోయిన సుడాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో 392 మంది భారతీయులు న్యూఢిల్లీలో దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అంతర్యుద్ధంలో కూరుకుపోయిన సుడాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో 392 మంది భారతీయులు న్యూఢిల్లీలో దిగారు. సుడాన్ నుంచి తొలుత జెడ్డాకు చేరుకున్న వారిని తాజాగా సీ-17జే మిలిటరీ రవాణా విమానంలో డిల్లీకి చేర్చారు. యుద్ధ వాతావరణంలో నుంచి ప్రాణాలతో బయటపడ్డందుకు వారందరి ఆనందానికి అంతేలేకుండా పోయింది.

బుధవారం తొలిసారిగా 360 మంబి భారతీయులు కమర్షియల్ విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఆ తరువాత రెండో బ్యాచ్‌లో మరో 246 మంది స్వదేశానికి తిరిగొచ్చారు. నేడు 392 మంది ఉన్న మూడో బ్యాచ్ నేడు భారత్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అధికారిక లెక్కల ప్రకారం, ఇప్పటివరకూ 992 మంది సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరీలో భాగంగా కేంద్రం ఘర్షణలతో అట్టుడుకుతున్న ఖార్తూమ్ నుంచి భారతీయులను తొలత పోర్ట్ సుడాన్‌కు చేరుస్తోంది. అక్కడి నుంచి మిలిటరీ విమానాలు, రవాణా నౌకల ద్వారా వారిని సౌదీలోని జెడ్డా నగరానికి చేరుస్తోంది. జెడ్డా నుంచి ప్రైవేటు విమానాలు, మిలిటరీ ఎయిర్‌ప్లేన్స్‌లో భారతీయులు స్వదేశంలో కాలుపెడుతున్నారు.

Updated Date - 2023-04-29T00:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising