NRI TDP USA: న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో రోజంతా 'అన్న ఎన్టీఆర్' ప్రకటన
ABN, First Publish Date - 2023-05-26T20:58:03+05:30
ఎన్నారై టీడీపీ అమెరికా కో-ఆర్డినేటర్ ‘జయరాం కోమటి’ నేతృత్వంలో ‘టైమ్ స్క్వేర్’లో నిలువెత్తున ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలిక అచ్చరువొందేలా, కనుల విందు చేయనుంది.
అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రాంతం న్యూయార్క్ లోని ‘టైమ్ స్క్వేర్’. కోట్లకు పడగలెత్తిన వారు ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలాంటి చోట ఔట్ డోర్ ప్రకటనలు ఇవ్వాలంటే, సెకన్ల వ్యవధికి సైతం భారీ స్థాయిలో ఖర్చవుతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు ‘అన్న ఎన్టీఆర్’ కొలువుదీరనున్నారు. ఎన్నారై టీడీపీ అమెరికా కో-ఆర్డినేటర్ ‘జయరాం కోమటి’ నేతృత్వంలో ‘టైమ్ స్క్వేర్’లో నిలువెత్తున ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలిక అచ్చరువొందేలా, కనుల విందు చేయనుంది.
200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ఈ ప్రకటన ఏర్పాటు చేయనున్నారు. నిజానికి సెకన్ కు భారీగా వసూలు చేసే ఈ ప్రాంతంలో, ఏకంగా 24 గంటల పాటు ‘అన్న ఎన్టీఆర్’ ప్రకటనను ఏర్పాటు చేయడం సంచలనమనే చెప్పాలి.
‘అన్న ఎన్టీఆర్’ శత జయంతిని పురస్కరించుకుని ‘ఎన్నారై టీడీపీ-అమెరికా’ ఆధ్వర్యంలో ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు అంటే, ఎన్టీఆర్ పుట్టిన రోజు 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ప్రకటన డిస్ ప్లే కానుంది. ‘అన్న ఎన్టీఆర్’ విభిన్న క్యారెక్టర్లను ఈ డిస్ ప్లే పై ప్రదర్శించనున్నారు. ప్రతి 4 నిముషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఈ ప్రకటన ప్రసారం కానుంది. రోజు రోజంతా ఇలా ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలికను ప్రకటన రూపంలో డిస్ ప్లే చేయడం, అత్యంత ఖరీదైన వ్యవహారమైన ‘టైమ్ స్క్వేర్’లో ఇలా ఒక వ్యక్తి కోసం, ప్రకటనను భారీ ఖర్చుతో ఏర్పాటు చేయడం రికార్డుగా మారనుంది.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘టైమ్ స్కేర్’లో ఎన్నారై టీడీపీ నేతలు, ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఏర్పాటు చేస్తున్న ఈ ప్రకటన ద్వారా ‘అన్న ఎన్టీఆర్’ కీర్తి మరింత ప్రాచుర్యంలోకి రానుందని అంటున్నారు పరిశీలకులు.
ప్రపంచంలోని ‘అన్న ఎన్టీఆర్’ అభిమానులంతా ఈ ప్రకటనను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రకటనను స్థానిక ఎన్నారై టీడీపీ నాయకులు విద్య గారపాటి సమన్వయ పరుస్తున్నారు.
Updated Date - 2023-05-26T21:15:24+05:30 IST