ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: TPAD ఆధ్వర్యంలో డాలస్‌లో రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2023-04-07T17:05:20+05:30

తెలుగు పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ తాజాగా కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ సంస్థల సహకారంతో డాలస్‌లో రక్తదాన శిబిరం నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలుగు పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీపాడ్-TPAD) తాజాగా కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ సంస్థల సహకారంతో డాలస్‌లో రక్తదాన శిబిరం నిర్వహించింది. ఐటీ స్పిన్ సంస్థ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో 48 మంది పాల్గొని, తమ సామాజిక బాధ్యతను నిర్వహించారు. దాతల నుంచి మొత్తం 50 పింట్స్ రక్తాన్ని సేకరించామని, దీన్ని గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరిగిన సందర్భాల్లో ఉపయోగిస్తామని కార్టర్ సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. రఘువీర్ బండారు రెడ్డి(ఎఫ్ చైర్) లింగా రెడ్డి ఆల్వ(ప్రెసిడెంట్), సుధాకర్ కలసాని(బోఓటీ చైర్), రోజా అడెపు ఆధ్వర్యంలో రూప కన్నయ్యగారి, నరేవ్ లింగంపల్లి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. టీపాడ్ బృందం, ఇతర వలంటీర్లు తమ వంతు తోడ్పాటునందించారు.

సామాజిక సేవలో ముందుండే టీపాడ్ గత పదేళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. ఇక కరోనా సంక్షోభం తరువాత ఏటా రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించింది. రక్తదాన శిబిరాల నిర్వహణతో టీపాడ్ ఇప్పటివరకూ వెయ్యికి పైగా ప్రజల ప్రాణాలు కాపాడింది. ఈ సేవలకు గుర్తుగా కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ టీపాడ్‌ను సామాజిక సేవలో కమ్యూనిటీ ఛాంపియన్‌గా గుర్తించింది. ఇక.. డాలస్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వలంటీర్లు, దాతలు, సహాయకులందరికీ టీపాడ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది.

Updated Date - 2023-04-07T17:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising