ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో దారుణం.. అత్త, భార్య, ఐదుగురు పిల్లలను వరుసగా..

ABN, First Publish Date - 2023-01-06T16:37:47+05:30

అమెరికాలో దారుణం వెలుగు చూసింది. యూటా రాష్ట్రానికి చెందిన మైఖేల్ హైట్ తన కుటుంబం మొత్తాన్ని చంపి ఆపై తానూ ప్రాణాలు తీసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) దారుణం వెలుగు చూసింది. యూటా(Utah) రాష్ట్రానికి చెందిన మైఖేల్ హైట్(42) తన కుటుంబం మొత్తాన్ని చంపి ఆపై తానూ ప్రాణాలు తీసుకున్నాడు. బుధవారం ఇనిక్(Enoch) నగరంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. కడుపున పుట్టిన ఐదుగురు బిడ్డలతో పాటూ భార్య, అత్తను తుపాకీతో కాల్చి ఆపై ఆత్మహత్యకు పూనుకున్నాడని ఇనిక్ పోలీసులు గురువారం పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. క్రిస్మస్‌ సమయంలోనే నిందితుడి భార్య అతడికి విడాకుల నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. అయితే.. ఈ దారుణానికి కారణం విడాకులేనా అన్నది ఇప్పుడే నిర్ధారించలేమని పోలీసులు తెలిపారు.

మృతులందరూ స్థానికులకు చిరపరిచితులు కావడంతో ఇనిక్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం స్నేహితులు, ఇరుగుపొరుగు వారందరికీ ఇది భారీ కుదుపని అధికారులు వ్యాఖ్యానించారు. గతంలో ఆ కుటుంబంలో ఓ వివాదం తలెత్తగా తాము దర్యాప్తు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. నిందితుడికి అతడి భార్య డైవర్స్ నోటీసులు ఇచ్చిన విషయం కూడా తమకు తెలుసని చెప్పారు. అది మినహా.. బాధిత కుటుంబానికి సంబంధించి మరే ఇతర వివాదం ఇటీవల కాలంలో తమ దృష్టికి రాలేదని చెప్పారు. తమతో స్నేహంగా ఉంటున్న ఓ కుటుంబం ఇలా అకస్మాత్తుగా మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మైఖేల్ హైట్ భార్య డిసెంబర్ 21న యూటా డైవర్స్‌కు దరఖాస్తు చేసుకోగా 27న నోటీసులు అందాయి. అయితే.. భర్తతో ప్రమాదం పొంచి ఉండొచ్చన్న అనుమానాలు నిందితుడి భార్య ఎప్పుడూ వ్యక్తం చేయలేదని ఆమె పరిచయస్థులు పేర్కొన్నారు. డైవర్స్‌కు గల కారాణాలేంటో కూడా ఇంకా తెలియరాలేదు. రాష్ట్ర చట్టాల ప్రకారం డైవర్స్‌కు గల కారణాలు ప్రజలకు బహిర్గతం చేయరు. ఇక ఘటనలో మృతి చెందిన చిన్నారులు 4 నుంచి 17 ఏళ్ల వయసున్న వారేనని, వారిలో ఏడేళ్ల వయసున్న కవలలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిజానిజాలు చేసేందుకు పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-01-06T16:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising