ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా గల్ఫ్ దేశాలలో భారత జాగృతి నిరసన

ABN, First Publish Date - 2023-03-12T18:40:02+05:30

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కె. కవితకు గల్ఫ్ దేశాలలోని బీఆర్ఎస్ అభిమానులు, భారత జాగృతి సభ్యులు మద్దతుగా నిలుస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కె. కవితకు గల్ఫ్ దేశాలలోని బీఆర్ఎస్ అభిమానులు, భారత జాగృతి సభ్యులు మద్దతుగా నిలుస్తున్నారు. విచారణకు ఒక రోజు ముందు బహ్రెయిన్‌లో(Bahrain) భారత జాగృతి గల్ఫ్ విభాగం అధ్యక్షుడు చెల్లంశెట్టి హరిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ యం. సంజయ్ కుమార్ పాల్గొని ప్రజాదరణ కల్గిన ప్రతిపక్ష నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందని విమర్శించారు. గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీయుల్లో అత్యధికులు కవితకు మద్దతుగా ఉన్నారని హరిప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం ఒమాన్ రాజధానిలో భారత జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ అధ్యక్షత సమావేశమై బీజేపీ తీరును నిరసించారు. ప్రధాన కార్యదర్శి వడియాల దేవేందర్ రెడ్డి, మోతే నరేష్, పుష్ప నరేశ్, శిరీష బాల రాజులు కవితకు పూర్తిగా మద్దతు పలికారు. కువైత్‌లో భారత జాగృతి అధ్యక్షుడు వినయ్ కుమార్ అధ్యక్షత సమావేశమైన సభ్యులు కూడా కవితకు మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. దుబాయి, షార్జాలల్లోనూ బీఆర్ఎస్ అభిమానులు సామాజిక మాధ్యమాలలో కవితకు అండగా ఉంటామని పోస్టులు పెట్టారు.

Updated Date - 2023-03-12T19:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising