ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: సుడాన్ నుంచి భారతీయుల తరలింపునకు విమానాలు రెడీ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన

ABN, First Publish Date - 2023-04-23T19:56:36+05:30

రణరంగంగా మారిన సుడాన్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: రణరంగంగా మారిన సుడాన్‌లో(Sudan) పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం పేర్కొంది. అక్కడి భారతీయుల తరలింపునకు(Evacuating Indians) వీలుగా సీ-130 రవాణా విమానాలు, యుద్ధ నౌకను ఇప్పటికే సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ‘‘సురక్షిత ప్రాంతాలకు భారతీయుల తరలింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు సీ-130జే విమానాలను(C-130J) జెడ్డాలో సిద్ధంగా ఉంచింది. ఇక గస్తీ నౌక ఐఎస్ఎస్ సుమేధా కూడా పోర్టు సుడాన్‌కు చేరుకుంది’’ అని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

సుడాన్ రాజధానిలో చిక్కుకుపోయిన విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శనివారం ఖార్తూమ్‌లోని చిక్కుకున్న 150 మంది విదేశీయులను సౌదీ అరేబియా ప్రభుత్వం జెడ్డాకు తరలించింది. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. ఇక భారతీయుల తరలింపు కోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో నిరంతరం చర్చలు జరుపుతూ రవాణా చర్యలను సమన్వయం చేస్తున్నామని కూడా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

సుడాన్‌పై ఆధిపత్యం కోసం సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య వివాదం కొద్ది రోజుల క్రితం హింసాత్మక రూపం దాల్చిన విషయం తెలిసిందే. గతంలో పౌర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సైన్యం సుడాన్ పగ్గాలను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో సైన్యానికి పారామిలిటరీ దళాలు తోడుగా నిలిచాయి. అయితే..ప్రస్తుతం సుడాన్ పగ్గాలను పౌర ప్రభుత్వానికి అప్పగించాల్సిన తరుణంలో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై హింసాత్మక ఘర్షణలకు దారి తీసింది. మొదట దాడులకు దిగింది మీరేనంటూ సైన్యం, పారమిలిటరీ దళాలు పరస్పరణ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం, సుడాన్‌లో సుమారు 4 వేల మంది భారతీయులు ఉన్నారు.

Updated Date - 2023-04-23T19:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising