ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: న్యూజిలాండ్‌లో భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష! ఎంతటి కఠిన శిక్ష అయినా సరిపోదని బాధిత కుటుంబం ఆవేదన!

ABN, First Publish Date - 2023-05-07T21:37:14+05:30

జన్యు సమస్యతో బాధపడుతున్న ఓ మహిళపై హత్యాచారం చేసిన కేసులో ఓ భారత సంతతి యువకుడికి న్యూజీలాండ్‌లో 20 ఏళ్ల కారాగార శిక్ష పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: జన్యు సమస్యతో బాధపడుతున్న మహిళపై హత్యాచారం చేసిన కేసులో ఓ భారత సంతతి వ్యక్తికి న్యూజీలాండ్‌లో జైలు శిక్ష పడింది. రెండేళ్ల నాటి ఈ ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష పడింది. వీధుల్లో నివసించే షామా శర్మ 2021 సెప్టెంబర్ 22న ఘాంగ్ హరప్‌పై(27) అఘాయిత్యం చేశాడు. ఆక్‌ల్యాండ్‌లో ఉండే ఆమె ఎప్పటిలాగే వాకింగ్‌కు బయటకు వచ్చిన సందర్భంలో బలాత్కరించి హత్య చేశాడు. బాధితురాలి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మహిళ మృతదేహం ఘటనాస్థలికి సమీపంలోని పొదల్లో కనిపించింది. ఘటన జరిగిన రెండు రోజుల తరువాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కాగా, ఘాంగ్ హరప్‌ను నిందితుడు రెండు గంటల పాటు వేధింపులకు గురి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ముఖంపై ముష్ఠిఘాతాలు కురిపించి ఆమె గొంతునులిమి చంపేసినట్టు పోలీసులు తేల్చారు. బాధితురాలి ముఖంపై 13 గాయాలు అయినట్టు వెల్లడించారు. అయితే, నిందితుడికి ష్రిజోఫ్రేనియా వ్యాధి ఉన్న విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కానీ, దాడి జరిగిన సమయంలో అతడు పూర్తి తెలివిడితో ఉన్నాడని, పశువాంఛను తీర్చుకునే క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని స్పష్టం చేశారు. మహిళను వేధించడంలో అతడిలో కొంత పైశాచిక ధోరణి కూడా కనిపించిందని వ్యాఖ్యానించారు. ‘‘ ఏ కోర్టు తీర్పూ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు, ఎంతటి కఠిన శిక్ష వేసినా సరిపోదు’’ అంటూ బాధితురాలి తల్లి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-07T21:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising