ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: నేపాల్‌లో అరెస్టైన విదేశీయుల్లో ఇండియన్స్ టాప్..

ABN, First Publish Date - 2023-03-14T20:57:50+05:30

ఈ ఏడాది నేపాల్‌లో పోలీసులు అరెస్టు చేసిన విదేశీ నిందితుల్లో భారతీయులు సంఖ్యాపరంగా తొలిస్థానంలో నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్నారై డెస్క్: ఈ ఏడాది నేపాల్‌లో పోలీసులు అరెస్టు చేసిన విదేశీ నిందితుల్లో భారతీయులు సంఖ్యాపరంగా తొలిస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 20 దేశాలకు చెందిన 92 మంది విదేశీయులపై వివిధ నేరాల కింద కేసులు పెట్టినట్టు పేర్కొన్నారు. వీరిలో 27 మంది భారతీయులు కాగా.. 22 మంది చైనీయులని చెప్పారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు కొందరు నేపాల్‌ సరిహద్దు దాటి భారత్‌కు పారిపోయారని, లేకపోతే అరెస్టైన భారతీయుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదాని అక్కడి పోలీసులు చెప్పారు.

ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం..పోలీసులకు చిక్కిన విదేశీ నేరస్థుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ..చైనీయులే అధికంగా తీవ్ర నేరాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇద్దరు చైనీయులు మినహా ఇతర దేశాల వారెవరిపైనా నేపాల్‌లో హత్యానేరం కింద కేసు నమోదు కాలేదు. పోలీసులు కేసు పెట్టిన భారతీయుల్లో 13 మందిపై కస్టమ్స్ చార్జీల ఎగవేత తాలుకు అభియోగాలు నమోదయ్యాయి. నకిలీ నగదు చెలామణీ కేసులో ఐదుగురు, మాదకద్రవ్యాలు, బెదిరింపులు, కిడ్నాప్, ఫోర్జరీ తదితర కేసుల్లో మిలిగిన 14 మంది భారతీయులపై కేసులు నమోదు చేశారు. ఇక గతేడాది నేపాల్ పోలీసులు 108 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. వీరిలో 31 మంది భారతీయులు, 16 మంది చైనీయులు, 13 మంది బాంగ్లాదేశ్ వారు ఉన్నారు.

Updated Date - 2023-03-14T20:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising