ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎవరి కోసం ఎడారిలో కష్టపడిందో వారే ఆమెను వద్దనుకున్నారు.. ఓ తెలుగు మహిళ కన్నీటి గాథ..

ABN, First Publish Date - 2023-02-13T20:23:32+05:30

ఎవరి కోసం ఎడారిలో కష్టపడిందో వారే ఆమెను వద్దనుకున్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకూ ముందుకు రాలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎవరి బాగు కొరకు అన్ని సుఖసంతోషాలకు దూరంగా ఎడారి దేశాలకు వచ్చి కష్టపడతారో వారే చివరకు నిరాదరిస్తారు. సంపాదించినంత కాలం హారతులు పట్టే చేతులు సంపాదన ఆగిపోయిన తర్వాత ఛీదరిస్తాయి. కట్టుకొన్న వారి కోసం.. కన్న వారి బంగారు భవిష్యత్తు కోసం ఎడారికి వచ్చిన ఒక తెలుగు మహిళ రేయింబవళ్ళు కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఇంటికు పంపిస్తూ కన్ను మూయగా అమె శవం దండగ వద్దంటూ కుటుంబం నిరాకరించింది. చివరకు మస్కట్‌లోని ప్రవాసీయులే ఆత్మీయులుగా మారి ఆ మహిళకు అంతిమ సంస్కరాలు నిర్వహించారు(NRIs perform lastrites).

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన కందిబోయిన లక్ష్మి అనే మహిళ చాలా కాలంగా ఒమాన్‌లో(Oman) పని చేస్తుంది. గత నెల 11న అకస్మాత్తుగా గుండేపోటు రావడంతో అమె మరణించింది. ఇంటి అరబ్బు యాజమాని పశ్చిమ గోదావరి జిల్లాలో కుటుంబానికి సమాచారమందించినా వారు స్పందించలేదు. మస్కట్‌లోని ప్రవాసీ తెలుగు సామాజిక కార్యకర్తలయిన రత్న, చిన్ని, శేఖ్ అహ్మద్‌లకు విషయం తెలియడంతో వారు అమె భర్త వెంకటేశ్వరరావును సంప్రదించడానికి కొన్ని వారాల పాటు ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాలేదు.

చివరకు ఇతరులను అతని వద్దకు పంపించగా, తన ఆరోగ్యం బాగోలేదని, తాను విమానాశ్రాయం వరకు రాలేనని ఆయన చేతులెత్తేసాడు. చనిపోయిన లక్ష్మి మృతదేహాన్ని తీసుకురావడం వృధా అని, పైగా అంబులెన్సుకు డబ్బు దండుగని కూడా భర్త చెప్పడంతో రత్న, చిన్ని నివ్వెరపోయారు. కావల్సితే, మీరే అమెను ఒమాన్‌లో దహనం చేయండని చెప్పారు. ఇందుకు సంబంధించి కాగితాలు పంపించడంతో రత్న చిన్ని, శేఖ్ అహ్మద్‌లు తమ మిత్రులతో కలిసి లక్ష్మి మృతదేహాన్ని మస్కట్ నుండి 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న సోహార్‌లోని హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్ళి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

మస్కట్‌లో సామాజిక కార్యక్రమాలలో ముందుండే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యలక్ష్మి, రత్న, చిన్ని, కె. ధనలక్ష్మి, ధన, సన్నీ, భాస్కర్, ప్రసాద్, దొరబాబు, తెలంగాణకు చెందిన యువ సామాజిక కార్యకర్తలు షేఖ్ అహ్మద్, బెజ్జంకి రాకేష్ పటేల్, వినయ్, రాజు యాదవ్, శ్రీనివాస్ యాదవ్ కురమ తదితరులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Updated Date - 2023-02-13T20:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising