ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: 18 ఏళ్ల నాటి వీసా విధానాన్ని పునరుద్ధరించనున్న అమెరికా.. భారతీయులకు భారీ ప్రయోజనం..

ABN, First Publish Date - 2023-02-10T18:31:59+05:30

వీసాల జారీని మరింత సులభతరం చేసేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2004లో ముగిసిన వీసా విధానాన్ని మళ్లీ పునరుద్ధరించే యోచనలో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: వీసాల జారీని మరింత సులభతరం చేసేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2004లో ముగిసిన వీసా విధానాన్ని మళ్లీ పునరుద్ధరించే యోచనలో ఉంది. ఇది హెచ్-1బీ(H-1b) వీసా దారులకు మేలు చేకూరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ విధానం(Domestic Visa revalidation) కింద 2004 వరకూ హెచ్-1బీ సహా కొన్ని రకాల వలసేతర వీసాల(Non Immigrat Visas) రెన్యూవల్ లేదా స్టాంపింగ్‌ను(Visa Renewal, Stamping) అమెరికాలోనే నిర్వహించేవారు. ఆ తరువాత నుంచీ హెచ్-1బీ వీసాదారులు తమ వీసా రెన్యూవల్ పాస్‌పోర్టులపై స్టాంపింగ్ కోసం స్వదేశాల్లోని అమెరికా కాన్సూలేట్లకు వెళ్లాల్సి వస్తోంది. నాటి వీసా విధానాన్ని ప్రయోగాత్మకంగా మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రస్తుతం అమెరికా సిద్ధమవుతోంది. దశల వారీగా వచ్చే రెండు మూడేళ్లలో దీన్ని మరింత విస్త్రత పరచనుందని సమాచారం.

కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా వీసాలు పొందడం కష్టతరంగా మారిన విషయం తెలిసిందే. వీసా అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా..మునుపటి డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు. ‘‘వీలైనంత త్వరగా ఈ విధానాన్ని పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా(Pilot Basis) దీన్ని మొదలెట్టొచ్చు. ఈ విధానంలో తొలి దశలో ఎంత మంది లబ్ధిపొందుతారని ఇప్పుడే చెప్పలేం. అయితే.. ఈ విధానం మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తే.. వీసా రెన్యూవల్ కోసం సొంతదేశాలను వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు హెచ్-1బీ వీసాపైనే అధికంగా ఆధారపడతాయి. తమ వృత్తిలో ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అమెరికా ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితిపై ఈ వీసాలు జారీ చేస్తుంది. ఇండియా, చైనాకు చెందిన వేల మంది హెచ్-1బీ వీసాతో అమెరికా సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు.

Updated Date - 2023-02-10T18:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising