ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే!

ABN, First Publish Date - 2023-12-09T12:54:18+05:30

పొద్దునే కడుపులో ఇంత కాఫీ గానీ, టీ గానీ పడకపోతే చాలామందికి రోజు ప్రారంభం కాదు. అయితే, కొందరికి టీ అలవాటు ఉంటే, మరికొందరికి కాఫీ బాగా నచ్చుతుంది. ఇక కాఫీలు చాలా ఫ్లేవర్లలో దొరుకుతుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ ఏంటి? దాని ఖరీదు ఎంత? అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1/6

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ వచ్చేసి 'కోపి లువాక్' (Kopi Luwak). దీన్ని సివెట్ కాఫీ (Civet Coffee) అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సివెట్ లేదా పునుగు పిల్లి మలం (Poop) తో తయారు అవుతుంది.

2/6

ఒక కప్పు సివెట్ కాఫీ కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. అమెరికాలో ఒక్క కప్పుకాఫీకి దాదాపు రూ. 6 వేలు ఉంటుంది. సౌదీ అరేబియా, దుబాయ్, యూఎస్, యూరప్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కాఫీ 1కేజీ ధర రూ. 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది.

3/6

వెంటనే ఈ కాఫీకి ఇంత ఖరీదు ఎందుకనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ. అంతేకాదండోయ్ పోషకాల గని కూడా.

4/6

ఇక 'కోపి లువాక్' కాఫీ ఖరీదు పెరగడానికి మరో కారణం వచ్చేసి దాని తయారీ విధానం. ఇది చాలా డిఫరెంట్‌, కష్టంతో కూడుకున్నది కావడమే.

5/6

పునుగు పిల్లులు కాఫీ గింజలను చాలా ఇష్టంగా తింటాయి. కానీ అవి చెర్రీ గుజ్జును పూర్తిగా జీర్ణం చేసుకోలేవు. దానికి కారణం వాటి పేగులలో జీర్ణ ఎంజైమ్‌లు అంతగా ఉండకపోవడమే. అందుకే అవి తిన్న కాఫీ గింజలు వాటి మలంతో పాటు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు వాటిని బాగా క్లీన్ చేసి, అన్ని రకాల సూక్ష్మజీవులు తొలగిపోయేలా పూర్తిగా శుద్ధి చేస్తారు. అనంతరం వాటిని కాల్చిన తర్వాత కాఫీ తయారు చేస్తారు.

6/6

ఇక ఈ కాఫీ ఇండియాలోని కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇండోనేషియా కూడా ఈ కాఫీని భారీ పరిమాణంలో ఉత్పత్తి చేస్తోంది.

Updated Date - 2023-12-09T14:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising