Bangalore: మంత్రి అఫిడవిట్‌లో మతిపోయే వివరాలు.. భర్తకు, మామకు అప్పులిచ్చిన మంత్రి గారి భార్య..!
ABN, First Publish Date - 2023-04-15T17:21:51+05:30
కర్ణాటక రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ (Dr K Sudhakar) కంటే ఆయన భార్య డాక్టర్ జీఏ ప్రీతి (GA Preethi) శ్రీమంతురాలు. భర్త సుధాకర్‌తో పాటు..
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ (Dr K Sudhakar) కంటే ఆయన భార్య డాక్టర్ జీఏ ప్రీతి (GA Preethi) శ్రీమంతురాలు. భర్త సుధాకర్‌తో పాటు మామ పీఎన్ కేశవరెడ్డికు (PN Kesava Reddy) కూడా ప్రీతి అప్పులు ఇచ్చారు. మరోసారి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ సుధాకర్ గురువారం చిక్కబళ్ళాపుర (Chikkaballapur) అభ్యర్థిగా నామినేషన్‌లు దాఖలు చేశారు. ప్రీతి పేరిట రూ.16.10 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో నమోదు చేశారు. 2019 ఉప ఎన్నికల వేళ సుధాకర్ చరాస్థి రూ.1.18 కోట్లు గాను, భార్య చరాస్థి రూ.13.70 కోట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం సుధాకర్ చరాస్తులు రూ.2.79 కోట్లుగాను భార్య చరాస్తుల విలువ రూ.6.59 కోట్లుగా ప్రకటించారు. వీటి ప్రకారం.. మూడేళ్ళ వ్యవధిలో భార్య ఆస్తులు భారీగా తగ్గాయి.
ఇక సుధాకర్ రూ.52.81 లక్షల స్థిరాస్తులు, రూ.97.37 లక్షల పిత్రార్జిత ఆస్తులు కలిగినట్లుగా ప్రకటించారు. భార్య ప్రీతి నుంచి సుధాకర్ 2016, 2019లలో రూ.40.33 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇక సుధాకర్ తండ్రి కేశవరెడ్డి కోడలు ప్రీతి నుంచి రూ.55.57 లక్షల రుణం తీసుకున్నారు. 2019 ఉప ఎన్నికల వేళ నమోదు చేసిన అఫిడవిట్‌లో వివిధ బ్యాంకు ద్వారా రూ.29.84లక్షలు రుణం తీసుకున్నట్లు డాక్టర్ సుధాకర్ నమోదు చేశారు.
Updated Date - 2023-04-15T17:21:51+05:30 IST