ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP MLA Flexi: జగన్‌కు ఝలక్ ఇచ్చినట్టేనా..? కలకలం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు

ABN, First Publish Date - 2023-01-12T15:36:04+05:30

సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే (Mylavaram MLA) వసంత కృష్ణ ప్రసాద్ (Vasanta Krishna Prasad) ఫ్లెక్సీలు కలకలం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ జిల్లా: సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే (Mylavaram MLA) వసంత కృష్ణ ప్రసాద్ (Vasanta Krishna Prasad) ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బాలకృష్ణ, ఎమ్మెల్యే వసంత (Balakrishna MLA Vasanta Flexi) ఫొటోలతో ఫ్లెక్సీలు మైలవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా జి.కొండూరు మండలం వెలగలేరులో బాలకృష్ణ అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు కట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ (Balakrishna Veera Simha Reddy), వసంతకృష్ణ ప్రసాద్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా వైసీపీ రంగు గానీ, ఆ పార్టీ అధినేత జగన్ ఫొటో గానీ లేకపోవడం కొసమెరుపు. బాలకృష్ణ-వసంత ఫోటోల ఫ్లెక్సీలు వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల సొంత పార్టీపై పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజా ఫ్లెక్సీ వ్యవహారంతో వసంత రూటు ఎటో వైసీపీ శ్రేణులు చెప్పకనే చెబుతున్నాయి.

వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీపై బాహాటంగా విమర్శలు చేసి ఆయన పార్టీని వీడనున్నారనే ప్రచారానికి తావిచ్చారు. అక్రమ కేసుల విషయంలో తమ పార్టీలో ఉన్న కొందరు నాయకులపై అసంతృప్తి ఉందని, పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానని వసంత కృష్ణప్రసాద్ నిట్టూర్చారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని ఆయన చెప్పుకొచ్చారు. రౌడీలను వెంటేసుకుని తిరిగితేనే ముందుకెళ్లే పరిస్థితులున్నాయని, ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని వసంత కృష్ణప్రసాద్ నిర్వేదం వ్యక్తం చేయడం కొసమెరుపు. సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేపోతున్నానని మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో వైసీపీ నేతలు హుటాహుటిన భేటీ అయ్యారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెల్లంపల్లి శ్రీనివాస్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌‌ను కలిశారు. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అయినప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉన్నట్లు తెలిసింది.

గుంటూరులో టీడీపీ ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు పేదలకు చీరెల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారి ముగ్గురు మహిళలు మృతి చెందారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవోను కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఘటనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరాదని సీఎం పేషీ నుంచి సందేశం అందినట్టు కూడా సమాచారం. దీనిని ధిక్కరిస్తూ ఎమ్మెల్యే వసంత కొండపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం గుంటూరు ఘటనను ప్రస్తావించారు. ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు సేవా దృక్పధాన్ని కొనియాడటంతో పాటు జరిగిన సంఘటనను ఉలవలు, చిలవలుగా చిత్రీకరించడం బాధాకరం అంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా చేస్తే ఎన్నారైలు భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలు చేసేందుకు రాష్ట్రానికి రాకుండా పోతారని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానాన్ని ధిక్కరించినట్టయింది.

Updated Date - 2023-01-12T15:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising