Dog Food: కుక్కకు పెట్టే ఆహారాన్ని మనుషులు తినకూడదా..? ఓ వ్యక్తి అదే పనిగా డాగ్ ఫుడ్‌ను తినడంతో ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-03-22T15:11:59+05:30
మనం ఇంట్లో పెంచుకునే కుక్కలకు ``పెడిగ్రీ`` వంటి ఎక్కువ ప్రొటీన్ ఉండే ఆహారం పెడుతుంటాం. అలాగే కుక్కలకు పెట్టే బిస్కెట్లలో కూడా ప్రొటీన్ అధిక మోతాదులో ఉంటుంది.
మనం ఇంట్లో పెంచుకునే కుక్కలకు (Dogs) ``పెడిగ్రీ`` వంటి ఎక్కువ ప్రొటీన్ (Protein) ఉండే ఆహారం పెడుతుంటాం. అలాగే కుక్కలకు పెట్టే బిస్కెట్లలో కూడా ప్రొటీన్ అధిక మోతాదులో ఉంటుంది. అమెరికాకు చెందిన ఓ కుర్రాడు ప్రొటీన్ కోసం కుక్క తినే ఆహారాన్ని (Dog Food) తినడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Viral News).
బఫెలో నివాసి హెన్రీ క్లారిస్సే అనే కుర్రాడు తన అలవాటు గురించి మాట్లాడాడు. ``నేను మొదటి సారి కుక్క ఆహారం తిన్నప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. అది నాకు గులకరాయిలా అనిపించింది. తినడానికి అస్సలు బాగోలేదు. దాన్ని నమలడం కూడా చాలా కష్టమైంది. కానీ, సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్ కోసం నేను డాగ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నా. కానీ, ఇకపై అలా చేయను. ఎందుకంటే కుక్కల ఆహారం అధిక ప్రోటీన్ కలిగి ఉంటుంది. అది మానవ వినియోగానికి తగినది కాదు. కుక్కల ఆహారంలో విటమిన్ K, విటమిన్ K3 సింథటిక్ రూపంలో ఉంటాయి. ఇవి మానవులకు అత్యంత ప్రమాదకరం`` అని హెన్రీ చెప్పాడు.
Big Alert to Bachelors: బ్యాచులర్స్‌కు గుండె దడ తెప్పించే వార్త.. పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టాలే అనుకునే వాళ్ల కోసమే..!
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కూడా 2016లో ఇలాంటిదే చేసింది, ఆ తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. హెన్రీ కూడా డాగ్ ఫుడ్ తింటూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడట. తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే అలా చేశానని, ఎవరూ డాగ్ ఫుడ్ తీసుకోవద్దని హెన్రీ చెబుతున్నాడు. కాగా, హెన్రీ డాగ్ ఫుడ్ తింటున్న వీడియోకు 28 లక్షల వ్యూస్, 25 లక్షల లైక్‌లు వచ్చాయి.
Updated Date - 2023-03-22T15:11:59+05:30 IST