Human Cat: ఇదేం పిచ్చి తల్లి.. ఈమె వెర్రి వీర లెవెల్.. పిల్లిలా మారేందుకు 20 శరీర మార్పులు
ABN, First Publish Date - 2023-10-31T16:08:45+05:30
ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఈ కాలం యువతకు అది పీక్స్‌కి చేరుకుందనే చెప్పుకోవాలి. సాధారణంగా.. మనకు పిల్లులు లేదా కుక్కలు నచ్చితే వాటిని పెంచుకుంటాం. ప్రేమగా చూసుకుంటూ...
ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఈ కాలం యువతకు అది పీక్స్‌కి చేరుకుందనే చెప్పుకోవాలి. సాధారణంగా.. మనకు పిల్లులు లేదా కుక్కలు నచ్చితే వాటిని పెంచుకుంటాం. ప్రేమగా చూసుకుంటూ, వాటి ఆలనాపాలనా చూసుకుంటాం. కానీ.. కొందరు మాత్రం వాటి రూపాల్లో మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తి కుక్కల మీద ప్రేమతో కుక్కగా మారాడు. రూపాంతరం చెందలేదు కానీ, కుక్క సూట్ వేసుకొని వీధుల్లో తిరుగుతున్నాడు. ఇతనిలాగే మరో వ్యక్తి కూడా విశ్రాంతి దొరికినప్పుడల్లా నక్క సూట్ వేసుకొని కాలక్షేపం చేస్తున్నాడు. అయితే.. ఓ యువతి మాత్రం ఇద్దరిని మించి హద్దులు దాటేసింది. పిల్లిలా రూపాంతరం చెందేందుకు.. 20 శరీర మార్పులు చేయించుకుంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
ఆ యువతి పేరు చియారా డెల్'అబేట్. ఇటలీకి చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో ఐడిన్ మోడ్ అనే పేరుతో బాగా పాపులారిటీ గడించింది. ఈమెకు పిల్లులంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే.. తాను పిల్లిగా మారాలని అనుకుంది. ఇంకేముంది.. తన కోరికను ఆచరణలోకి పెట్టడం మొదలుపెట్టింది. తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. పిల్లిలా మారేందుకు తన శరీరంలో మార్పులు చేయించుకుంటూ వస్తోంది. అలా ఇప్పటివరకూ 20 శరీర మార్పుల్ని పొందినట్లు తానే స్వయంగా వెల్లడించింది. టిక్‌టాక్‌లోనూ ఈ అంశంపై ఎన్నో వీడియోలు చేసి, మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ప్రస్తుతం ఆమె శరీరంపై మొత్తం 72 కుట్లు ఉన్నాయి. నాసికా రంధ్రాలు, నాలుకను చీల్చడం, 0.8-సెంటీమీటర్ల పై పెదవి కుట్లు. 1.6-సెంటీమీటర్ల లోపలి లాబియా కుట్లు వంటి తదితర శరీర మార్పులు ఆమె చేయించుకుంది.
అంతేకాదు.. చియారా ‘బ్లేఫరోప్లాస్టీ’ సర్జరీ కూడా చేయించుకుంది. ఇది ఎగువ/దిగువ కనురెప్పలపై చేసే శస్త్రచికిత్స ప్రక్రియ. కనురెప్పల వైకల్యాలను సవరించడానికి, కంటి ప్రాంతాన్ని సౌందర్యంగా సవరించడానికి ఈ సర్జరీ నిర్వహించబడుతుంది. దీనికితోడు నాలుగు కొమ్ములు, ఆరు జననేంద్రియ పూసలు, ఐబాల్ టాటూలు, పాయింటెడ్ చెవులు, శాశ్వత ఐలైనర్, నుదిటి ఇంప్లాంట్లు, పిల్లి పంజా తరహా గోళ్లను సైతం ధరించింది. మరో విశేషం ఏమిటంటే.. పిల్లిలాగా మారడం కోసం తన చనుమొనలను కూడా తొలగించింది. పిల్లిలాగా మారేందుకు మానవ శరీరం ఎంతవరకు సహకరిస్తుందని, ఈ మార్పులతో ఏం సాధించగలిగానో చూడటానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని చియారా చెప్పుకొచ్చింది. తాను కచ్ఛితంగా ఒక కూల్ క్యాట్ లేడీ అవుతానంటూ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె వయ్యారాలు పోయింది.
తనకు పిల్లులంటే ఎంతో ఇష్టమని, సరైన శరీర మార్పులతో తాను కచ్ఛితంగా ఒక ధైర్యమైన మహిళా పిల్లిగా తయారవుతానని చియారా తెలిపింది. అయితే.. పూర్తి పిల్లి రూపంలో మారడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని చెప్పింది. కళ్లకు కాంథోప్లాస్టీ సర్జరీ, దంతాల రీషేపింగ్, ఎగువ పెదవి కట్‌తో పాటు మరిన్ని శస్త్రచికిత్సలు అవసరమని పేర్కొంది. తోక కోసం తాను ట్రాన్స్‌డెర్మల్ అనే వస్తువును వాడుతానని, మరిన్ని టాటూలు కూడా వేయించుకుంటానని కుండబద్దలు కొట్టింది. ఎంత నొప్పినైనా తాను భరిస్తానని, పూర్తిగా పిల్లి గెటప్‌లో వచ్చేంతవరకు తాను వెనక్కు తగ్గనని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. వాటిని తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేసింది. కొందరు తనని ప్రోత్సాహించేలా సందేశాలు కూడా పెడ్తుంటారని చియారా చెప్పుకొచ్చింది.
Updated Date - 2023-10-31T16:08:45+05:30 IST