ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతడి వయసు 55 ఏళ్లు.. అయిదేళ్లుగా క్షవరం మానేశాడు.. గడ్డం పెంచేస్తున్నాడు.. అసలు కారణమేంటని అడిగితే..

ABN, First Publish Date - 2023-03-03T10:54:43+05:30

ఆ పెద్దాయన కూడా 5ఏళ్ళ క్రితం వరకు చక్కగా జుట్టు కత్తిరించుకునేవాడు, తన పనులు ఎంతో ఉత్సాహంగా చేసుకునేవాడు. కానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

'ఆ జుట్టు చూడు ఎలా పెరిగిపోయిందో.. గువ్వ పిచ్చుకల గూడు ఉన్నట్టుంది. పో.. పొయి కటింగ్ చేయించుకో'. పనుల హడావిడితోనూ, ఇతర కారణాల వల్లా కటింగ్ చేయించుకోకుండా ఉండే మగవాళ్ళను గూర్చి ప్రతి ఇంట్లో వినిపించే మాటలు ఇవి. కారణాలు ఏవైనా చక్కగా జుట్టు కత్తిరించుకోవడం ఓ క్రమశిక్షణ అనుకోవచ్చు. ఆ పెద్దాయన కూడా 5ఏళ్ళ క్రితం వరకు చక్కగా జుట్టు కత్తిరించుకునేవాడు, తన పనులు ఎంతో ఉత్సాహంగా చేసుకునేవాడు. కానీ 5ఏళ్ళ నుండి కటింగ్ చేయించడం, గడ్డం గీసుకోవడం ఆపేశాడు. ఈయన ఇలా చేయడం వెనుక కారణమేంటి వివరంగా తెలుసుకుంటే..

రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలో ధాబర్ గ్రామం ఉంది. నారారామ్ అనే 55ఏళ్ళ వ్యక్తి ఈ గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతనికి ఈ ప్రాంతలో సుమారు రెండు ఎకరాలకు పైగా స్థలం ఉంది. అయితే ఆ స్థలాన్ని వేరేవారు ఆక్రమించుకున్నారు. దీంతో నారారామ్ ఆన్లైన్ లో సిఎం హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశాడు. ఇతని ఫిర్యాదు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే అయ్యింది. ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. కానీ నారారామ్ మాత్రం తన ప్రయత్నం ఆపకుండా ధాబర్ గ్రామ అభివృద్ది అధికారి ద్వారా ఉన్నతాదికారులకు లేఖ రాశాడు. ఆ లేఖలో 'నా స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నారు, నేనెంత విన్నవించుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. వీటి వల్ల నేను మానసికంగా కృంగిపోయాను' అని పేర్కొన్నాడు. నారారామ్ ఇంత చేసినా అతని అవేదన అలాగే నిలిచిపోయింది. పై అధికారులు నారారామ్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇతనికి మతిస్థిమితం లేదని ముద్రవేశారు.

Read also: ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిగా మార్చుకునే ప్రయత్నంలో కుర్రాడు.. కోర్టు మెట్లెక్కిన తండ్రి.. వీరి కథేంటంటే..


2022, అక్టోబర్ 5వ తేదీన నారారామ్ నివసిస్తున్న ఇంటికి నిప్పంటుకుంది. అది క్రమంగా పెద్దదయ్యి ఇంటిని దగ్దం చేసింది. ఈ ప్రమాదంలో ఇతని ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి. అప్పుడు తనకు సహాయం చేయండంటూ ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆయనకు ఎలాంటి సహాయం అందలేదు. పేదలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఏ విధమైన లబ్ది నారారామ్ చేకూరడం లేదు.ఇతను తను నివసిస్తున్న ధాబర్ గ్రామం నుండి సైకిల్ మీద ప్రయాణించి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి చేరుకుంటాడు.అడవిలో కలపను సేకరించి దాన్ని సైకిల్ మీద పెట్టుకుని పక్క గ్రామాలకు వెళ్ళి ఆ కలపను అమ్ముతున్నాడు. దీని ద్వారా వచ్చే డబ్బుతో ఇతను జీవితం సాగిస్తున్నాడు. ప్రభుత్వ తీరుకు వైరాగ్యం చుట్టుముట్టిన 55సంవత్సరాల ఈ వృద్దుడు తన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు క్షవరం చేయించనని, గడ్డం గీయనని భీష్మించుకున్నాడు.

Updated Date - 2023-03-03T10:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!