ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AC: ఇంట్లో వాడే ఏసీని కొని అయిదేళ్లకు పైనే అయిందా..? అయితే వెంటనే చేయాల్సిన పనేంటంటే..!

ABN, First Publish Date - 2023-07-21T17:54:47+05:30

చాలా మందికి ఏసీ గురించి తెలిసిన విషయాల కంటే, తెలియని విషయాలే ఎక్కువ..

ధనవంతుల ఇళ్ళలోనే కాదు, మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఇప్పట్లో ఏసీలు ఉంటున్నాయి. ఏసీ లేకపోతే చాలామందికి నిద్రపట్టదు. అలవాటైపోయిన తరువాత చలికాలం, వర్షాకాలం, వేసవికాలం అంటూ కాలంతో సంబంధం లేకుండా ఏసీని వినియోగిస్తుంటారు. అయితే చాలా మందికి ఏసీ గురించి తెలిసిన విషయాల కంటే, తెలియని విషయాలే ఎక్కువ ఉండటం గమనార్హం. ఏసీ కొని 5ఏళ్ళు దాటితే మాత్రం దానిగురించి మరింత జాగ్రత్త అవసరం. ఏసీ కొన్నప్పటికంటే పాతబడే కొద్ది చల్లదనం ఇవ్వడం తగ్గిస్తుంది. అలా జరగకుండా ఉండాలన్నా, ఏసీ కొన్నప్పుడు ఎంత బాగా చల్లదనం ఇచ్చిందో అలా తిరిగి పనిచేయాలన్నా ఈ 3పనులు వెంటనే చేయాలి(old AC cooling methods). అవేంటో తెలుసుకుంటే..

శుభ్రపరచడం..(Cleaning)

ఏసీ కొన్న చాలామందికి దాన్ని ఆపరేట్ చేయడం మాత్రమే వస్తుంది. కానీ ఏసీని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఏసీ పాతబడినా దాని పనితీరు మెరుగ్గా ఉంటుంది. గాలిని ఫిల్టర్ చేయడం కారణంగా ఏసీలో మురికి చేరిపోతుంది. ఈ మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటే ఏసీ 5ఏళ్లు దాటినా కొత్తదానిలా చల్లదనం ఇస్తుంది. ఏసీని సొంతంగానూ శుభ్రం చేయించుకోవచ్చు, లేదంటే సర్వీస్ చేసేవారితోనూ శుభ్రం చేయించవచ్చు.

Viral: జాబ్ కోసం ఇంటర్వ్యూకు వచ్చిన ఓ కుర్రాడి కండీషన్స్ విని అవాక్కైన రిక్రూటర్.. భవిష్యత్తులో ఇలాగే ఉంటుందంటూ..!


గ్యాస్ చెకింగ్..(gas checking)

వాడేకొద్ది ఏసీ పాతబడుతుంది. దీంతో పాటు క్రమంగా గ్యాస్ కూడా తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల కూడా ఏసీ ఇచ్చే గాలి అంత చల్లగా అనిపించదు. అందుకే 5ఏళ్ళు దాటిన ఏసీని వాడుతున్నప్పుడు గ్యాస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ ను ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి.

కంప్రెసర్..(compressor)

ఏసీ విషయంలో తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏదైనా ఉందంటే అది కంప్రెసర్ విషయంలోనే. ఏసీ చల్లగాలి అందించకపోవడానికి కంప్రెసర్ ప్రత్యక్షప్రభావం చూపిస్తుంది. ఏసీని ఎక్కువగా ఆన్, ఆఫ్ చేసుంటే అది కంప్రెసర్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా కంప్రెసర్ పనితీరు దెబ్బతింటుంది. ఎప్పుడైనా ఏసీ పనిచేయడంలో పదేపదే ఇబ్బందులు తలెత్తుతుంటే అది కంప్రెసర్ లో కలిగిన ఇబ్బందిగా గుర్తించాలి. ఏసీని ఆన్ చేసిన తరువాత ఎప్పుడూ దాన్ని ట్యాంపర్ చేయకూడదు. 5ఏళ్ళు దాటిన ఏసీ కంప్రెసర్ లకు ఎక్కువ పని కలిగేలా చేయకూడదు.

Monsoon Hair Fall: వర్షాకాలంలోనే కొందరికి ఎందుకిలా..? విపరీతంగా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే..!


Updated Date - 2023-07-21T17:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising