Actor Injured: షూటింగులో గాయపడ్డ యువ హీరో
ABN, First Publish Date - 2023-02-09T10:50:26+05:30
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ (Arun Vijay) షూటింగులో గాయపడ్డారు. ఈ ప్రమాదం (Accident) లో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ (Arun Vijay) షూటింగులో గాయపడ్డారు. ఈ ప్రమాదం (Accident) లో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయుర్వేద (Ayurveda) చికిత్సా కేంద్రంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరుణ్ విజయ్ హీరోగా ‘అచ్చం ఎన్బదు ఇల్లైయే’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
అయితే, షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు అరుణ్ విజయ్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో ఆయన కేరళ (Kerala) రాష్ట్రానికి వెళ్లి ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు. తన చికిత్సకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన అరుణ్ విజయ్.. ‘మోకాళ్లకు ఏర్పడిన గాయానికి ఆయుర్వేద విధానంలో చికిత్స చేయించుకుంటున్నాను. ఇది నాలుగో రోజు చికిత్స. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను’ అని ఆయన ఇన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో వైరల్ పోస్ట్‌పై ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘త్వరగా కోలుకోవాలి అన్న’.. ‘మీ కోసం ప్రార్థిస్తాం’ అంటూ రాసుకొస్తున్నారు.
Updated Date - 2023-02-09T10:50:41+05:30 IST