Aditi Rao Hydari: దక్షిణాది దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-03-03T19:53:53+05:30

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari). తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలను చేశారు. అదితికి దక్షిణాదిలోనే ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. హిందీలో తక్కువ మూవీస్‌ చేస్తున్నారు.

Aditi Rao Hydari: దక్షిణాది దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari). తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలను చేశారు. అదితికి దక్షిణాదిలోనే ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. హిందీలో తక్కువ మూవీస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది దర్శకులపై అదితి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన టాలెంట్‌ను దక్షిణాది దర్శకులు బాగా వాడుకుంటున్నారని అనేక మంది చెబుతుంటారని ఆమె తెలిపారు.

అదితి రావ్ హైదరి ‘ఓకే బంగారం’, ‘నవాబ్’, ‘సమ్మోహనం’, ‘వి’ వంటి దక్షిణాది చిత్రాలను చేశారు. తన టాలెంట్‌ను దక్షిణాది డైరెక్టర్స్ వాడుకున్న విధంగా బాలీవుడ్ వాడుకోవడం లేదని తన సన్నిహితలు చెబుతున్నారని ఆమె తెలిపారు. ‘‘నేను ఈ మాటలను చాలా సార్లు విన్నాను. తమిళ్, మలయాళీ డైరెక్టర్స్ కొంచెం ఎక్కువ ప్రతిభ ఉన్నవారు అని నేను అనుకుంటున్నాను. కానీ, నాకు ఆఫర్స్ విషయంలో ఎటువంటి చీకు చింతా లేదు. అన్ని ఇండస్ట్రీస్‌లోని వారు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారు. నాకు చిన్నతనంలో మణిరత్నం (Mani Ratnam) సినిమాలో హీరోయిన్‌గా చేయాలని ఉండేది. మణిరత్నం తమిళ్ ఇండస్ట్రీస్‌లో ఎక్కువగా పనిచేస్తారు. అందువల్ల తమిళ్ నేర్చుకోవాలని కూడా నాకు తెలుసు. నేను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ, అమ్మమ్మ అందరు అద్భుతంగా కథలను చెప్పేవారు. కథలకు భాష, మతం, కులంతో సంబంధం లేదని అప్పుడే నాకు అర్థమైంది. కథలో భాగంగా భావోద్వేగాలను బాగా వ్యక్తపరచాలి. ఆ భావోద్వేగాలను ఏ భాషలోనైనా చెప్పవచ్చు’’ అని అదితి రావ్ హైదరి పేర్కొన్నారు.

అదితి రావ్ హైదరీ తాజాగా ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’ (Taj Divided By Blood) లో నటించారు. ఈ వెబ్‌సిరీస్ జీ-5 లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 3 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. అదితి రావ్ హైదరి ఈ సిరీస్‌లో అనార్కలీ పాత్రను పోషించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-03T19:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!