ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aditi Rao Hydari: సిద్దార్థ్‌తో ప్రేమాయణంపై స్పందించిన హీరోయిన్

ABN, First Publish Date - 2023-03-04T15:35:24+05:30

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari). ‘నవాబ్’, ‘వి’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari). ‘నవాబ్’, ‘వి’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ అందాల భామ తాజాగా ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’ (Taj: Divided by Blood)లో నటించింది. ఈ వెబ్‌సిరీస్‌లో అనార్కలీ పాత్రను పోషించింది. ఈ షో ‘జీ-5’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. సిద్దార్థ్‌తో ప్రేమాయణంపై స్పందించింది.

హీరో సిద్దార్థ్‌ (Siddharth)తో అదితి రావ్ హైదరి సహజీవనం చేస్తున్నారని గత కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా ముంబైలో పలు మార్లు వీరిద్దరు జంటగా దర్శనమిచ్చారు. శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా జోడీగా విచ్చేశారు. ఈ మధ్యనే వీరు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ‌వైరల్‌గా మారింది. ఫలితంగా రిలేషన్‌షిప్ రూమర్స్‌పై అదితి రావ్ హైదరి స్పందించింది. ‘‘ఇటువంటి రూమర్స్‌కు నేను ప్రాధాన్యమివ్వను. నేను పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాను. అందువల్ల ఇటువంటి వాటిని పట్టించుకోను. ప్రజలు ఎల్లప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అందరి నోళ్లను మనం మూయించలేం. ఆసక్తికరమైన విషయాల గురించి వారు చర్చించుకుంటారు. నాకు ఆసక్తిని కలిగించే పనిని నేను చేస్తున్నాను. ప్రస్తుతం నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌తో నేను పనిచేస్తున్నాను. ప్రజలు నన్ను నటిగా అంగీకరించినంత వరకు నటిస్తూనే ఉంటాను. ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. నేను నటించే చిత్రాలు, షోలపై ప్రజల దృష్టి ఉండాలి. నా డైరెక్టర్ కోరుకున్న విధంగా కనిపించడానికి నేను ఇష్టపడతాను. అక్కడ మాత్రమే నా దృష్టిని కేంద్రికరిస్తాను. మిగతా విషయాలను పట్టించుకోను’’ అని అదితి రావ్ హైదరి పేర్కొంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ‘హీరామండి’ (Heeramandi), ‘జూబ్లి’ (Jubilee) వంటి వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) చిత్రంలోను కీలక పాత్ర పోషిస్తోంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-04T18:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising