Shahrukh Khan: ‘పఠాన్’ కంటే ఆ వెబ్‌సిరీసే బెటర్!

ABN, First Publish Date - 2023-02-22T19:31:55+05:30

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Shahrukh Khan: ‘పఠాన్’ కంటే ఆ వెబ్‌సిరీసే బెటర్!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. అయితే, కొంత మంది ప్రేక్షకులు మాత్రం ఓ వెబ్‌సిరీస్‌తో ‘పఠాన్’ ను పోలుస్తూ హేళన చేస్తున్నారు.

TNM.jpg

ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor) కీలక పాత్ర పోషించిన వెబ్‌సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager). ఇంగ్లిష్ వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా రూపొందింది. ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ అవుతుంది. స్పైల కథాంశంతో రూపొందిన ఈ షో నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ, ఈ వెబ్‌సిరీస్ నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అయింది. ‘పఠాన్’ కూడా ‘స్పై’ కేటగిరిలోనే తెరకెక్కింది. థియేటర్ ప్రేక్షకుల కోసం డిజైన్ చేయబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. కానీ, కొంత మంది సినీ ప్రేక్షకులు మాత్రం ‘పఠాన్’ ను హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘టీఎన్‌ఎమ్ ఈజ్ బెటర్ దన్ పఠాన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-22T19:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising