Viral: వింత వ్యాధి..77 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోడానికి ఇతడు చెప్పిన కారణం తెలిస్తే..
ABN, First Publish Date - 2023-10-14T17:19:48+05:30
ఆఫ్రికాలోని రవాండాకు చెందిన ఓ వ్యక్తి తన జీవితమంతా బ్రహ్మచారిగానే గడిపేశాడు. మహిళలంటే భయం కలిగించే వింత వ్యాధితో భయపడుతున్న అతడు ఆడ తోడు అంటే ఏంటో తెలీకుండా ఇన్నేళ్ల జీవితాన్ని గడిపేశాడు. ప్రస్తుతం ఈ వృద్ధుడి ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మనుషులు యుక్తవయసు వచ్చాక ఓ తోడు కోసం వెతుక్కుంటారు. కానీ, ఓ వృద్ధుడు మాత్రం ఆడవాళ్ల ఉనికే సహించలేక చివరకు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. మహిళ నీడ కూడా తన మీద పడకూడదంటూ తన ఇంటి చుట్టు ఏకంగా చిన్న కంచెనే ఏర్పాటు చేసుకున్నాడు. యుక్తవయసు వచ్చి నాటి నుంచీ అతడిది ఇదే పరిస్థితి. ఇప్పుడితనికి ఏకంగా 77 ఏళ్లు, మనిషి సాయం లేనిదే పూట గడవని స్థితి. అయినా ఇప్పటికీ అదే తీరు! అతడికీ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలిసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది(77 africa man is afraid of women).
Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..
ఈ వింత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పేరు క్యాలిట్ జామ్విటా. అతడిది ఆఫ్రీకాలోని రువాండా దేశం. అతడికి గైనోఫోబియా అంటే వింత వ్యాధితో బాధపడుతున్నాడు. వాస్తవానికి ఇది మానసిక వ్యాధిగా డాక్టర్లు గుర్తించరు. అదెలా ఉన్నప్పటికీ దాని బారినపడ్డ క్వాలిట్ జీవితం తలకిందులైపోయింది. ఊహ తెలిసిన నాటి నుంచీ అతడు మహిళలంటే భయపడిపోయేవాడు. వారిని చూస్తే చాలు భయం, ఆందోళనలు ఆయనను కమ్మేస్తాయి. చమటలు పట్టేస్తాయి, గుండె వేగం పెరుగుతోంది. చివరకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది.
Viral: పట్టెడన్నం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నావ్! ఈ కష్టం ఎవరికీ రాకూడదు బ్రో.. షాకింగ్ వీడియో!
దీంతో, జీవితమంతా మహిళలకు దూరంగానే గడిపేశాడు. మహిళలు లేని ప్రదేశం అంటూ ఉండదు కాబట్టి ప్రపంచానికే దూరంగా బతకడం నేర్చుకున్నాడు. ఓ చిన్న ఇల్లు నిర్మించుకుని ఇంటి చుట్టూ మహిళలు రాకుండా ఓ కంచె కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ, వయసు మీద పడటంతో అతడు సాయం లేకుండా ఒక్క పని కూడా చేసుకోలేని స్థితి వచ్చేసింది.
IT: భారతీయ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం!
అయితే, ఇతడి పరిస్థితి గ్రహించిన గ్రామంలోని ఆడవాళ్లు పెద్దాయనను ఇబ్బంది పెట్టకుండానే చేయూతనిస్తుంటారు. బియ్యం, పప్పూలాంటికి దూరం నుంచి అతడి ఇంటి వాకిట్లో విసిరేస్తారు. ఆ తరువాత మహిళలు వెళ్లిపోయాక ఆయన మెల్లగా బయటకు వచ్చి వాటిని తీసుకుని మళ్లీ లోపలికిపోయి గట్టిగా తలుపేసుకుంటాడు. అతడి పరిస్థితి తలుచుకుని స్థానికంగా ఉండే ఓ మహిళ విచారం వ్యక్తం చేసింది. ‘‘మేం కనిపిస్తే చాలు అతడు భయపడిపోతాడు. కానీ ఏం చేసుకోలేని స్థితిలో ఉన్న పెద్దాయనకు మాకు తోచిన మేరకు సాయం చేస్తూ ఉంటాం. కానీ అప్పుడు కూడా మమ్మల్ని దూరంగానే ఉండమని చెబుతూ ఉంటాడు’’ అని ఆ మహిళ తెలిపింది. ఈ వింత వైఖరి కారణంగా అతడు స్థానికంగానే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిపోయాడు.
Viral: పబ్లిక్‌గా పోలీసుపై రెచ్చిపోయిన మహిళ.. వద్దు వద్దు అంటున్నా వినకుండా.. వైరల్ వీడియో
Updated Date - 2023-10-14T17:32:16+05:30 IST