Allu Aravind: నా కోడలు అవసరం లేకున్నా పని చేస్తోంది
ABN, First Publish Date - 2023-02-05T15:11:45+05:30
ఆడపిల్లలను వారికి ఇష్టమైన పని చేయనివ్వాలని టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు.
ఆడపిల్లలను వారికి ఇష్టమైన పని చేయనివ్వాలని టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ఇటీవలే థియేటర్స్‌లో విడుదలై విజయవంతమైంది. దీంతో మూవీ సక్సెట్‌మీట్‌ని జరుపగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ పై వ్యాఖ్యలు చేశారు.
‘ఇంత వయసు వచ్చిన నేను ఇంత ఎనర్జీతో ఉండటానికి కారణం యంగ్‌స్టర్స్. వారితో రోజు కలిసి పనిచేస్తుంటా. వాళ్లే నా ఎనర్జీ. ధీరజ్, వాసు ఈ సినిమాని మనం విడుదల చేద్దామన్నప్పుడు తటపటాయించాను. కానీ ఓసారి ఈ సినిమాని చూశాకా మాత్రం కచ్చితంగా ఈ మూవీని రీలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన చిత్రమిది. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. తల్లిదండ్రులు అందరూ వారింట్లోని ఆడపిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారో తెలుసుకొని ఆ దిశగా ప్రొత్సహించాలని తెలిపే చిత్రం రైటర్ పద్మభూషణ్.
నా కోడలు స్నేహ (Sneha) గురించి మీకు తెలుసు. ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టింది. బన్నీలాంటి పెద్ద స్టార్‌ని పెళ్లి చేసుకుంది. నిజానికి తనకి పని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికే పని చేస్తూనే ఉంటుంది. ఆడపిల్లలంటే అలాగే ఉండాలి. అంతేకాకుండా.. ఈ సినిమా చూసిన వెంటనే నా భార్య దగ్గరకి వెళ్లి.. నువ్వేం అవ్వాలనుకుంటున్నావని అడిగా’ అని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-02-05T15:11:46+05:30 IST