ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aloe Vera Side Effects: కలబంద ఎంత మంచిదో అని అంతా అనుకుంటారు కానీ.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?

ABN, First Publish Date - 2023-07-25T16:46:13+05:30

కలబందను నేరుగా చర్మసంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ ఉపయోగిస్తారు. బరువు తగ్గించడం, అందాన్ని పెంచడం, షుగర్ అదుపులో ఉంచడం, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడం. ఇలా కలబంద వల్ల ఎన్ని లాభాలో అనుకుంటారు. అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా వాడేస్తుంటారు. కానీ..

కలబంద ఇంటి పెరట్లోనూ, ఇంటి ముందు కుంపట్లోనూ ఎదిగే మొక్క. గత 10,15ఏళ్ళ క్రితం కలబంద గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం జెల్ నుండి జ్యూస్ వరకు బోలెడు ఉత్పత్తులున్నాయి. కలబందను నేరుగా చర్మసంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ ఉపయోగిస్తారు. బరువు తగ్గడం, అందాన్ని పెంచడం, షుగర్ అదుపులో ఉంచడం, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడం. ఇలా కలబంద వల్ల ఎన్ని లాభాలో అనుకుంటారు. అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా కలబంద వాడేస్తుంటారు. కానీ కలబంద వాడేవారు దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి.

కలబందను మొక్క నుండి వేరు చేసిన తరువాత దాన్ని కట్ చేసిన భాగంలో పసుపు రంగులో ద్రవంలాగా వస్తుంది. దీన్ని కలబంద రబ్బరు పాలు(Aloe Vera rubber milk) అంటారు. ఈ రబ్బరు పాలు కొందరిలో చర్మానికి అలెర్జీ(skin allergy) కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఈ కారణంగా చర్మం మీద దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. కృత్రిమ కలబంద ఉత్పత్తులలో చాలావరకు కలబంద పైన ఉండే ఆకుపచ్చ భాగాన్ని కూడా గ్లైండ్ చేసేస్తుంటారు. కాబట్టి చర్మ సంబంధ సమస్యలున్నవారు కలబందను చాలా జాగ్రత్తగా వాడాలి.

తాజా కలబంద జెల్ ను ఆరోగ్యం కోసం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కడుపు తిమ్మిరి(stomach cramps), శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గిపోవడం(discrease potassium levels) వంటి సమస్యలకు దారితీస్తుంది.

PhonePe: ఫోన్‌పే యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్..!


కలబంద రసం ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి(sugar levels discreased). చక్కెర స్టాయిలను పరిశీలనలో ఉంచుకుని మాత్రమే దీన్ని తీసుకోవాలి.

కొన్నిపదార్థాలు తీసుకున్న తరువాత శరీరంలో వేడి పుడుతుంది. కలబంద కూడా అలాంటి గుణం కలిగినదే. కలబందను తీసుకుంటే శరీరం డీహైడ్రేట్(body dehydration) కు గురి అవుతుంది.

కలబందను చర్మ సంరక్షణలో(skin care) ఉపయోగించడం వల్ల అందం పెరుగుతుందని అనుకుంటారు. ఇది నిజమే.. కలబంద చర్మం మూడు పొరలలోకి చొచ్చుకువెళ్ళి చర్మాన్ని రిపేర్ చేస్తుంది. అదే సందర్భంలో చర్మాన్ని చాలా సున్నితంగా కూడా మార్చేస్తుంది. గాయాలు,శస్త్రచికిత్సలు వంటివి జరిగినప్పుడు అవి నయం కావడానికి చాలా సమయం పడుతుందని, ఇది క్లిష్టతరమైన సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

Curd: మట్టి పాత్రలోనే పెరుగును తోడు పెట్టమని చెప్పేది ఇందుకే.. నూటికి 99 శాతం మందికి తెలియని 5 నిజాలివీ..!


Updated Date - 2023-07-25T16:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising