Viral: ఇలాంటి సైకిల్ ప్రపంచంలోనే మరొకటి లేదు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
ABN, First Publish Date - 2023-10-22T21:56:52+05:30
భారతీయుల టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ఓ కొత్త రకం ఈ-బైక్‌ను నెటిజన్లకు పరిచయం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎక్స్ వేదికగా ఓ కొత్త రకం ఈ-బైక్‌ను(E-bike) నెటిజన్లకు పరిచయం చేశారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న వారు దీన్ని రూపొందించారని ఆయన చెప్పారు. అంతేకాదు, ఈ తరహా డిజైన్ ఉన్న బైక్‌లు ప్రపంచంలో మరెక్కడా లేవని చెప్పుకొచ్చారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Viral: తొలిసారి చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి.. అక్కడి సీన్ చూసి..
ఐఐటీ బాంబేలో చదువుకున్న వారు పెట్టిన ఓ సార్టప్ సంస్థ ఈ సైకిల్‌ను డిజైన్ చేసిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ అంకుర సంస్థలో తాను కూడా పెట్టుబడి పెట్టినట్టు వివరించారు. ‘‘ఐఐటీ బాంబేకు చెందిన వారు మరోసారి మనందరం గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా డైమండ్ ఫ్రేమ్ ఉన్న ఫోల్డబుల్ ఈ బైక్ రూపొందించారు. అంతేకాదు, దీనికి పూర్తి స్థాయి సైజులో ఉన్న చక్రాలు కూడా ఉన్నాయి. దీంతో, ఈ బైక్ మిగిలిన వాటితో పోలిస్తే 35 శాతం అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. అంతేకాదు, ఓ మాదిరి వేగంతో ప్రయాణించే సమయాల్లో మరింత స్థిరంగా ఉంటుంది. ఈ హార్న్‌బ్యాక్ ఎక్స్ 1 బండిని నేనూ ఒకటి కొన్నా. మా కార్యాలయం కాంపౌండ్ చుట్టూ ఓ రౌండ్ కొట్టా’’ అని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. అమెజాన్, ఫ్లిప్‌కార్డులో దీన్ని కొనుగోలు చేయచ్చని పేర్కొన్నారు.
H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!
Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
అంతేకాదు, తను ఈ ఈ-బైక్‌ను ట్రై చేస్తుండగా దిగిన కొన్ని ఫొటోలు కూడా ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. దీంతో, ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సంస్థలో పెట్టుబడి పెట్టి స్వదేశీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నందుకు ఆయనపై పలువురు ప్రశంసలు కూడా కురిపించారు.
Viral: రెండేళ్ల క్రితం ఉద్యోగం పోవడంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పైలట్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..
Youtube: 3.4 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్.. ఒక్క తప్పుతో మోనెటైజేషన్ రద్దు.. ఆమె పొరపాటు ఏంటంటే..
Updated Date - 2023-10-22T22:42:59+05:30 IST