Anasuya Bharadwaj: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ‘గే’ లు ఉన్నారు... లెస్బియన్స్‌తో అటువంటి అనుభవం..

ABN, First Publish Date - 2023-02-25T15:02:07+05:30

సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను తరచుగా పంచుకుంటుంటారు. డేరింగ్, డాషింగ్‌గా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఈ అందాల భామ నెటిజన్స్‌తో ముచ్చటించారు.

Anasuya Bharadwaj: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ‘గే’ లు ఉన్నారు... లెస్బియన్స్‌తో అటువంటి  అనుభవం..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ (Ansuya Bharadwaj) చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను తరచుగా పంచుకుంటుంటారు. డేరింగ్, డాషింగ్‌గా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఈ అందాల భామ నెటిజన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అనసూయ‌ను తెలివిగా ఓ ప్రశ్నతో ఇబ్బంది పెట్టారు. లెస్బియన్‌పై ప్రశ్న అడిగారు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది.

Anasuya.jpg

‘‘మీరు లిబరల్, మెచ్యూర్డ్ ఉమెన్ అయితే ఈ ప్రశ్నకు తప్పకుండా సమాధామివ్వాలి’’ అని నెటిజన్ చెప్పారు. ‘‘ఎప్పుడైనా లెస్బియన్స్‌తో అనుభవం ఎదురయిందా..?’’ అని అడిగారు. ‘‘మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ‘గే’ లు ఉన్నారు. అయితే, నాకు పర్సనల్‌గా ఇటువంటి అనుభవాలు ఎదురు కాలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం ఎదురయ్యాయి’’ అని అనసూయ భరద్వాజ్ సమాధానమిచ్చారు. ఆమె సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇటువంటి ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనప్పుడు సెలబ్రిటీలు జవాబు ఇవ్వరు. సమాధానాన్ని దాటవేస్తుంటారు. కానీ, అనసూయ మాత్రం జవాబివ్వడం నెటిజ‌న్స్‌ను ఆశ్చ‌ర్య‌పరిచింది. ‘‘మళ్లీ యాంకరింగ్‌ ఎప్పుడు చేస్తారు?’’ అని అడగగా దానికి కూడా ఆమె జవాబిచ్చారు. ‘టీఆర్పీ కోసం మేకర్స్ అవమానకరమైన స్టంట్స్ చేస్తున్నారు. అటువంటివి పోయినప్పుడు మాత్రమే యాంకరింగ్ చేస్తాను. నేను కూడా యాంకరింగ్‌ను మిస్‌ అవుతున్నా’ అని అనసూయ చెప్పారు.

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే ‘మైఖేల్’ (Michael) లో కనిపించారు. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule)లో నటిస్తున్నారు. ‘రంగమార్తాండ’ షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-25T15:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising