Anchor Rashmi Gautam: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిపై స్పందించిన రష్మి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
ABN, First Publish Date - 2023-02-22T11:36:45+05:30
వీధి కుక్కల దాడిలో అయిదేళ్ల బాలుడి మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
వీధి కుక్కల దాడిలో అయిదేళ్ల బాలుడి మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి అందరూ కదిలిపోయారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోయాడు. ఈ దుర్ఘటనపై ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. తమ విచారాన్ని వ్యక్తం చేశారు. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కూడా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. (stray dog Attack)
రష్మికి కుక్కలంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో కూడా చాలా విధి కుక్కలకి ఆహారం అందించి తన మంచి మనస్సుని చాటుకుంది. బాలుడి మృతిపై రష్మి షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘దురదృష్టవశాత్తు.. అవును, ఓ బాలుడు తన తప్పు లేకుండా మరణించాడు. అందుకు కుక్కలకి బర్త్ కంట్రోల్ చేయడానికి టీకా వేసి, ఆశ్రయం కల్పించి.. ఇటువంటి పరిణామాలకి ధీర్ఘకాలిక పరిష్కారం చూపించాలి. జంతువులు మనలాగే ప్రాణులు. వాటికి కూడా ప్రత్యేకంగా స్థలం అవసరం’ అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ భామ మాటలకి కొందరు సపోర్టు చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Breaking News: టాలీవుడ్‌లో మరో విషాదం.. కె.విశ్వనాథ్ ఆస్థాన ఎడిటర్ కన్నుమూత
‘రష్మి మీ అభిప్రాయం కరెక్టే.. చాలా మెచ్యూరిటీతో చెప్పారు’.. ‘మనదేశంలో ప్రజలకు అవగాహన లేదు. చాలామందికి క్రూరంగా ఉంటారు’ అని కొందరు రష్మికి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. ‘మీకు మనుషుల కంటే కుక్కలు ఎక్కువైపోయాయి’.. ‘మున్సిపాలిటీ వాళ్లు వాటి బర్త్ కంట్రోల్ చేయడానికి తీసుకెళితే.. మీలాంటి వాళ్లే కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు’.. ‘కుక్కలు చిన్న పిల్లాడిని చంపేశాయి. అయినా నీకు మనుషుల కంటే కుక్కలు ముఖ్యమైపోయాయి’.. ‘కుక్కలంటే అంత ఇష్టమైతే నువ్వే వాటికి ఓ షెల్టర్ సిద్ధం చేయొచ్చు కదా.. ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఎందుకు ఇస్తున్నావ్’ అని మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
Updated Date - 2023-02-22T12:00:22+05:30 IST