Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. మొదలుపెడితే 20 నిమిషాలపాటు నాన్‌స్టాప్‌గా..
ABN, First Publish Date - 2023-02-15T11:25:50+05:30
సినిమాల్లో ఎంతో అందంగా కనిపించే పలువురు హీరోయిన్లు నిజ జీవితంలో పలు అరుదైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.
సినిమాల్లో ఎంతో అందంగా కనిపించే పలువురు హీరోయిన్లు నిజ జీవితంలో పలు అరుదైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. అందులో మమతా మోహన్ దాస్, శృతిహాసన్ అలాంటి వ్యాధుల బారిన పడ్డారు. అనంతరం చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే నటి సమంత కూడా మయోసైటిస్‌తో అనే అరుదైన వ్యాధితో బాధపడున్నట్లు తెలిపింది. ఈ భామ కూడా ప్రస్తుతం ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఈ తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ కూడా తన అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు అనుష్క శెట్టి.
ఇటీవల ఓ తమిళ ఛానెల్‌తో అనుష్క మాట్లాడుతూ.. ‘నాకో అరుదైన వ్యాధి ఉంది. నవ్వే పరిస్థితి వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. దాన్ని అసలు కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాదు. 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. నేను నవ్వడం పలుమార్లు షూటింగ్ కూడా ఆపేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో ప్రొడక్షన్ టీమ్ తమ పనులను చక్క బెట్టుకుంటుంది’ అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Renu Desai: ‘గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నా.. అందుకే చెబుతున్నా’
అయితే.. అనుష్క సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఆమె చివరి సారిగా ‘నిశ్శబ్దం’ సినిమాలో కనిపించింది. కాగా.. ఈ భామ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో యువ నటుడు నవీన్ పోలీశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
Updated Date - 2023-02-15T11:49:21+05:30 IST