Amazon: అమెజాన్‌లో అందుబాటులో ఉన్న 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదీ.. ఈ ఆఫర్లు ఉపయోగించుకుంటే..!
ABN, First Publish Date - 2023-11-15T15:44:03+05:30
మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మంచి డీల్స్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ఇటీవల నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సూపర్ సక్సెస్ అయింది. ఆ సమయంలో చాలా మంది తక్కువ ధరలకే మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను దక్కించుకున్నారు.
మీరు మొబైల్ (Smart Phone) కొనాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మంచి డీల్స్ (Offers on Mobile) కోసం చూస్తున్నారా? అమెజాన్ (Amazon) ఇటీవల నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సూపర్ సక్సెస్ అయింది. ఆ సమయంలో చాలా మంది తక్కువ ధరలకే మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను దక్కించుకున్నారు. ఇప్పటికీ కూడా అమెజాన్ కొన్ని బ్రాండెడ్ మైబైల్స్‌ను (Branded Mobiles) తక్కువ ధరకే అందిస్తోంది. పలు ఆఫర్లను ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఈ మొబైల్స్‌ను దక్కించుకోవచ్చు. మీరు మొబైల్ కొనాలనుకుంటుంటే ఇది మంచి డీల్ (Deals on mobiles) అయ్యే అవకాశం ఉంది. ఒకసారి అవేంటో చూద్దాం.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ (OnePlus Nord CE 3 Lite 5G)
ఈ మొబైల్‌ను అమెజాన్ చాలా చౌక ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది. 19,999 ప్రారంభ ధరతో ఈ మొబైల్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటే రూ. 18,900 వరకు తగ్గింపు లభిస్తుంది.
రెడ్ మీ 12 (Redmi 12 5G)
ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.11,999. స్నాప్ డ్రాగన్ (Snapdragon 4 Gen 2 ) చిప్ సెట్‌తో క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్‌పై కూడా పలు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
రియల్ మీ నార్జో 60x (Realme Narzo 60x)
రూ.14,999 విలువైన రియల్ మీ నార్జో ఫోన్‌ను అమెజాన్ సంస్థ రూ.12,999కే అందిస్తోంది. 33W SuperVOOC ఛార్జింగ్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్‌పై కూాడా పలు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
రియల్ మీ నార్జో 60 (Realme Narzo 60x)
రియల్ మీ నార్జో 60పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఏకంగా రూ.5 వేలు తగ్గిస్తూ 19,999 విలువైన మొబైల్‌ను రూ. 14,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, అల్ట్రా వేగన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ M34 (Samsung Galaxy M34)
ఈ మొబైల్‌పై అమెజాన్ ఏకంగా రూ.8 వేల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. రూ.24,499 విలువైన సామ్‌సంగ్ గెలాక్సీ M34ను రూ.16,548కి కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్‌ను మార్చుకోవాలనుకుంటే మరింత తక్కువ ధరకు ఈ మొబైల్‌ను దక్కించుకోవచ్చు. రూ. 50 MP ట్రిపుల్ కెమేరాతో వచ్చే ఈ మొబైల్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.
Updated Date - 2023-11-15T15:44:06+05:30 IST