ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Women's Day 2023 : చేనేత పరిశ్రమ అంతరించిపోకూడదనే ఉద్దేశంతోనే... ఇదంతా !

ABN, First Publish Date - 2023-03-08T09:50:13+05:30

వ్యాపార విషయాల్లో యమున భర్త సతీష్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు.

weaving industry.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పట్టుచీరలు అనేవి స్త్రీల జీవితాలతో మానసికంగా పెనవేసుకున్న అపూర్వమైన బంధం. మామూలుగా అందంగా, రంగురంగులగా పేర్చిన అద్భుతమైన చీరలను కొనుక్కుంటూ, వాటిని తయారు చేసేందుకు చెమటోడ్చిన నేత కార్మికుల గురించి మనలో ఎంతమంది ఆలోచించి ఉంటాం? యమునా సతీష్ కాంచీపురంలో ఈ చేనేత కార్మికులను ప్రోత్సహించడం ద్వారా, నేత కార్మికులు, వినియోగదారుల మధ్య వారధిగా నిలబడింది.

యమునా సతీష్ స్వస్థలం కాంచీపురం. కాంచీపురం ఒరిజినల్ సిల్క్‌లను నేత కార్మికుల నుండి నేరుగా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఆమె శ్రీ భావి హ్యాండ్లూమ్ సిల్క్స్‌ను ప్రారంభించింది. యమున బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివింది. ఆమె 2014లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపార విషయాల్లో యమున భర్త సతీష్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. 2014 సంవత్సరంలో, ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రజలలో ప్రాచుర్యం పొందడం ప్రారంభించింది. అదే సమయంలో యమున సంప్రదాయ చేనేత కార్మికుల కుటుంబం కావడంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా, చేనేత పరిశ్రమ అంతరించిపోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టింది.

మగ్గాల‌ నుంచి డైరెక్ట్‌గా కొనడం, అమ్మడం ప్రారంభించింది. కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడడంతో ఉపాధ్యాయులు ఆదాయం లేకుండా ఇబ్బందులు పడ్డారు. ఈ రీసెల్లింగ్ పద్ధతి వారికి మంచి అవకాశంగా మారింది. రీసెల్ చేయాలనుకునే వారి కోసం చీరల ఫొటోలను వాట్సాప్ ద్వారా షేర్ చేస్తుంది యమున. ప్రస్తుతం దాదాపు 50 మంది రీసెల్లర్లు ఉన్నారు.

కంపెనీ పేరును సక్రమంగా నమోదు చేసి జీఎస్టీ పన్ను చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్నారు యమున దంపతులు. ఇలానే నెలకు దాదాపు 200, 300 పట్టుచీరలు విక్రయిస్తున్నారు. సగటు నెలవారీ ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటుంది. కరోనా సమయంలో, చీరలు అమ్మడంలో అవకాశం, ఆదాయం ఉందని చాలా మంది మహిళలు గ్రహించారు. అలాంటి రీసెల్లర్ల సంఖ్య రెట్టింపు అయింది. దీంతో అమ్మకాలు, ఆదాయం పెరిగాయి. కరోనా వ్యాప్తి తరువాత, ఆదాయం 7-8 లక్షల రూపాయలకు పెరిగింది.

చేనేత రంగుల కలబోతలో అందాన్ని నేత కార్మికుని ముఖంలో చిరునవ్వునీ చూడాలని యమున చేస్తున్న ప్రయత్నం ఫలించాలని కోరుకుంటూ, తనలా పట్టుదలతో సాగితే విజయం అందుకోవడం అందరికీ సాధ్యమని నిరూపించింది యమున.

Updated Date - 2023-03-08T11:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising