Viral: భార్య ఎఫైర్ గురించి తెలిసి భర్త సంచలన నిర్ణయం.. ఆమెకు విముక్తి కల్పించాలని..
ABN, First Publish Date - 2023-11-16T17:34:10+05:30
భార్య ఎఫైర్ గురించి తెలుసుకున్న ఓ భర్త ఆమెను ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసిన ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. వారి కొత్తకాపురానికి అడ్డురాకుండా పిల్లల బాధ్యత కూడా తనే తీసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్న తరుణంలో ఓ బీహార్ (Bihar) వ్యక్తి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. భార్య వివాహేతర సంబంధం(Wife's affair) గురించి తెలుసుకున్న అతడు ఆమెను ప్రియుడికే కట్టబెట్టాడు(Husband marries off wife to her lover). భార్య కొత్త కాపురానికి పిల్లలు అడ్డురాకుండా వారి బాధ్యతనూ తనే తీసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే, బేగుసరాయ్ జిల్లా(Begusarai District) దాహియా గ్రామానికి చెందిన అజయ్ కుమార్‌కు(24) 2018లో కాజల్‌తో(22) వివాహం జరిగింది. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. అయితే, కాజల్ అంతకుమునుపే ఆఘాపూర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఠాకూర్ అనే వ్యక్తిని ప్రేమించింది. వివాహం తరువాత కూడా ఆమె అతడితో సీక్రెట్‌గా సంబంధం కొనసాగించింది.
Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్
కాగా, ఇటీవల ఓ రోజు కాజల్ తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా అజయ్ బంధువుల కంట పడింది. దీంతో, వారు ఈ విషయాన్ని అజయ్‌కు చెప్పారు. అయితే, కాజల్ మాత్రం రాజ్‌తో బంధం తెంచుకోలేనని తెగేసి చెప్పింది. దీంతో, అజయ్ మరో ఆలోచన లేకుండా ఆమెను రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె కొత్త కాపురానికి పిల్లలు అడ్డురాకుండా ఉండేందుకు వారి బాధ్యతనూ తనే తీసుకున్నాడు.
‘‘మొదట ఆమె ఎఫైర్ గురంచి కుటుంబసభ్యులు చెప్పగా విని షాకైపోయా. కానీ ఆమెకు ఈ వివాహం నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించుకున్నా. రాజ్‌ను ప్రేమిస్తున్న ఆమెతో వివాహం బంధం కొనసాగించడంలో అర్థం లేదు. అందుకే, స్వయంగా వారి పెళ్లి జరిపించా. దీంతో, గ్రామస్తులు, కుటుంబసభ్యుల ఆగ్రహం నుంచి కూడా ఆమెను కాపాడగలిగా’’ అని అజయ్ చెప్పుకొచ్చాడు.
అయితే, కాజల్ కుటుంబసభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడంతో గ్రామ పంచాయితీతో పాటూ అక్కడి ప్రజలు కూడా అంగీకరించారు. కాగా, ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్‌గా(Viral) మారింది.
Updated Date - 2023-11-16T17:37:12+05:30 IST