Viral: దుబాయ్‌లో ఉత్త కాళ్లతో 104 కిలోమీటర్ల పరుగు.. భవిష్యత్తుపై బెంగతో ఓ భారతీయుడి సాహసం..
ABN, Publish Date - Dec 24 , 2023 | 08:30 PM
దుబాయ్ అంటేనే ముండుటెండలు..! అలాంటి భీకర వాతావరణంలో ఏకంగా 104 కిలోమీటర్లు పరుగుతీశాడో భారతీయుడు. మానవాళి భవిష్యత్తుపై బెంగ.. అతడితో ఈ సాహసం చేయించింది.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ అంటేనే ముండుటెండలు..! అలాంటి భీకర వాతావరణంలో ఏకంగా 104 కిలోమీటర్లు పరుగుతీశాడో భారతీయుడు. మానవాళి భవిష్యత్తుపై బెంగ.. అతడితో ఈ సాహసం చేయించింది.
వాతావరణ మార్పులు మానవ సమాజ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. పెరుగుతున్నా భూతాపంతో అంతం ముంచుకొస్తున్న అనేక దేశాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన కాప్ 28 సమావేశాలతో స్ఫూర్తి పొందిన ఆకాశ్ నంబియార్ ప్రజల్లో వాతావరణ మార్పులపై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు.
బెంగళూరుకు చెందిన నంబియార్..అల్ట్రా మారథాన్ రన్నర్, పరుగు అతడికి అలవాటే. దీంతో, మారథాన్ పరుగుతో రాబోయే విపత్తులపై అవగాహన పెంచాలనుకున్నాడు. తన సాహాసానికి వేదికగా దుబాయ్‌ను ఎంచుకున్నాడు. అల్ ఖద్రాలోని లవ్ లేక్ నుంచి ఉదయాన్నే తన మారథాన్ ప్రారంభించాడు. ఆ తరువాత పామ్ జుమైరా, బుర్జ్ అల్ అరబ్, కైట్ బీచ్ తదితర ప్రాంతాల మీదుగా బుర్జ్ ఖలీఫా వద్ద పరుగు ముగించారు. ఈ పరుగుతో తనకు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ మంచి అవకాశం చిక్కిందని ఆయన అన్నాడు.
Updated Date - Dec 24 , 2023 | 08:43 PM