Kartik Aaryan: డేటింగ్ చేసేంత సమయం లేదంటున్న హీరో

ABN, First Publish Date - 2023-01-22T19:25:33+05:30

కార్తిక్ ప్రమోషన్స్‌‌లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాను ఎవరిని ప్రేమించడం లేదని ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని చెప్పాడు.

Kartik Aaryan: డేటింగ్ చేసేంత సమయం లేదంటున్న హీరో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన వ్యక్తి కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). భిన్న చిత్రాల్లో కొత్త రకం పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ యంగ్ హీరోకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు తాజాగా ‘షెహజాదా’ (Shehzada) లో నటించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కార్తిక్ ప్రమోషన్స్‌‌లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాను ఎవరిని ప్రేమించడం లేదని ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని చెప్పాడు.

కార్తిక్ ఆర్యన్ ‘లవ్ అజ్ కల్ 2’ షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan)తో డేటింగ్ చేశాడని రూమర్స్ వచ్చాయి. ‘పతి, పతీ ఔర్ వో’ సినిమా అప్పుడు అనన్య పాండే (Ananya Panday) తో రిలేషన్ షిప్‌ను కొనసాగించాడని వదంతులు షికార్లు కొట్టాయి. ఈ రూమర్స్ అన్నింటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘ అనన్య పాండే, సారా అలీ ఖాన్‌లతో కలసి నేను నటించాను. అందువల్ల అటువంటి రూమర్స్ వచ్చాయి. డేటింగ్ చేసేంత సమయం నా దగ్గర లేదు. నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను. నేను ఎవరితోను రిలేషన్ షిప్‌ కొనసాగించడం లేదు. రాబోయే రెండేళ్ల పాటు నా డేట్స్‌ను సాజిద్ నడియడ్ వాలాకు ఇచ్చేశాను. అతడు నిర్మిస్తున్న చిత్రాల్లో నటిస్తున్నాను. ఇతరులతో కలసి కాఫీ తాగేంత సమయం నా వద్ద లేదు’’ అని కార్తిక్ ఆర్యన్ తెలిపాడు. ఇక కార్తిక్ ఆర్యన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘షెహజాదా’ లో నటించాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. మనీషా కొయిరాలా, పరేశ్ రావల్, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) కీ రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది. ‘ఆషికీ-3’ లోను హీరోగా నటిస్తున్నాడు.

Updated Date - 2023-01-22T19:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising