Deepika Padukone: ఆస్కార్స్‌లో సందడి చేయనున్న దీపిక

ABN, First Publish Date - 2023-03-03T16:18:23+05:30

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. భారతదేశ ఖ్యాతిని ఆమె ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గతేడాది జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు.

Deepika Padukone: ఆస్కార్స్‌లో సందడి చేయనున్న దీపిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. భారతదేశ ఖ్యాతిని ఆమె ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గతేడాది జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఆస్కార్స్‌ను ప్రదానం చేయనున్నారు. ఎమిలీ బ్లంట్ (Emily Blunt), శామ్యూల్ జాక్సన్ (Samuel L Jackson), డ్వేన్ జాన్సన్ (Dwayne Johnson), మైఖేల్ జోర్డాన్ (Michael B Jordan), జో సల్దానా (Zoe Saldana), రిజ్ అహ్మద్ తదితరులు కూడా పురస్కారాలను అందజయనున్నారు. ఆస్కార్ అవార్డ్స్‌ను లాస్ ఏంజెలెస్‌లో మార్చి 12న (భారతదేశ కాలమనం ప్రకారం మార్చి 13) ప్రదానం చేస్తారు. అయితే, అకాడమీ అవార్డ్‌ను అందజేయబోతున్న మొదటి భారతీయురాలు దీపికా పదుకొణె ఏం కాదు. గతంలో పెర్సిస్ ఖంబటా (Persis Khambatta), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వంటి భారతీయులు అకాడమీ అవార్డ్‌ను అందజేశారు.

దీపికా పదుకొణె తాజాగా ‘పఠాన్’ (Pathaan) లో నటించారు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలోని ‘బే షరమ్’ సాంగ్ తీవ్ర వివాదస్పదమయింది. పాటలో భాగంగా దీపిక ధరించిన దుస్తులపై అనేక మంది విమర్శలు కురిపించారు. హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ (Fighter) చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K) లో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-03T16:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!