ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weird News: గుండెపోటుతో చనిపోయిన అన్న.. మీకు నేనున్నానంటూ ముగ్గురు పిల్లల తల్లయిన వదినను పెళ్లి చేసుకున్న మరిది..!

ABN, First Publish Date - 2023-05-19T12:31:48+05:30

ఆమె వయసు 28 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలకు తల్లి.. మరోసారి గర్భం దాల్చింది.. ఆమె ఏడు నెల గర్భంతో ఉండగా భర్త మరణించాడు.. దీంతో ఆమె జీవితం అంధకారంలోకి కూరుకుపోయింది.. ఒంటరిగా ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో తెలియక ఆమె కుమిలి కుమిలి ఏడ్చింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె వయసు 28 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలకు తల్లి.. మరోసారి గర్భం దాల్చింది.. ఆమె ఏడు నెల గర్భంతో ఉండగా భర్త మరణించాడు.. దీంతో ఆమె జీవితం అంధకారంలోకి కూరుకుపోయింది.. ఒంటరిగా ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో తెలియక ఆమె కుమిలి కుమిలి ఏడ్చింది.. ఆ సమయంలో ఆమెకు భర్త సోదరుడు అండగా నిలిచాడు.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.. అన్న పిల్లలను తన పిల్లల్లా చూసుకుంటానని మాటిచ్చాడు (Viral News).

మహారాష్ట్రలోని (Maharashtra) జలగావ్‌కు శంభాజీ కేట్ అనే వ్యక్తి గతేడాది గుండెపోటుతో మరణించాడు. శంభాజీకి కవల కుమార్తెలు ఉన్నారు. అతడు మరణించే సమయానికి అతని భార్య అనిత ఏడు నెలల గర్భవతి. శంభాజీ ఆకస్మిక మరణం కారణంగా అనిత, ముగ్గురు పిల్లలు నిరాశ్రయులయ్యారు. పిల్లలను ఎలా పెంచి పెద్ద చెయ్యాలో తెలియక అనిత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ సమయంలో అనితకు శంభాజీ తమ్ముడు రాహుల్ అండగా నిలిచాడు. చిన్న వయసులోనే వితంతువుగా మారిన వదినను, అనాథలుగా మిగిలిన అన్న పిల్లలను చూసి రాహుల్ చలించిపోయాడు.

Viral News: సార్.. నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా.. ఓ బాలుడి మాటలు విని అవాక్కైన డాక్టర్.. అతడి కథంతా విని చలించిపోయి..!

వారి కష్టం తీరాలంటే వదినను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు (Brother-in-law Marries widowed sister-in-law). జీవితాంతం వదినకు, అమె పిల్లలకు అండగా నిలవాలనుకున్నాడు. కుటుంబ సభ్యలకు విషయం చెప్పాడు. మొదట వారు షాకైనా, తర్వాత రాహుల్ పెద్ద మనుసును అర్థం చేసుకున్నారు. రాహుల్ కేట్ నిర్ణయానికి కుటుంబ సభ్యులు మద్దతు పలికారు. గ్రామంలోని భవానీ ఆలయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో రాహుల్, అనితల వివాహం జరిగింది.

Updated Date - 2023-05-19T12:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising