ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi: రెండో తరగతి విద్యార్థికి ప్రధాని మోదీ లేఖ.. నెట్టింట్లో వైరల్

ABN, First Publish Date - 2023-02-19T18:42:08+05:30

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఓ రెండో తరగతి విద్యార్థికి రాసిన లేఖ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇటీవల ఓ రెండో తరగతి విద్యార్థికి రాసిన లేఖ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ లేఖ తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఆరుష్ శ్రీవత్స రెండో తరగతి చదువుతున్నాడు. గతేడాది ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్(Heeraben) తుదిశ్వాస విడిచారన్న వార్తను టీవీలో చూసిన బాలుడు బాధపడ్డాడు. దీంతో..అతడు ప్రధాని మోదీకి లేఖ(letter) రాశాడు. లేఖలో మోదీ మాతృమూర్తి మృతిపై సంతాపం(Condolence) వ్యక్తం చేశాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు.

దీంతో.. ప్రధాని మోదీ జనవరి 25న బాలుడికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖరాశారు. తల్లిని కోల్పోవడం పూడ్చుకోలేని లోటని, ఆ బాధను మాటల్లో వ్యక్తీకరించలేమని పేర్కొన్నారు. ఈ కష్టసమయంలో తనకు మద్దతుగా నిలిచినందుకు చిన్నారికి థ్యాంక్స్ చెప్పారు. ఇటువంటి ఆప్యాయత, అభిమానమే తనకు తల్లి లేని లోటును తట్టుకునేలా శక్తినిస్తోందని వ్యాఖ్యానించారు.

కాగా..బాలుడు రాసిన లేఖను, మోదీ ప్రత్యుత్తరాన్ని బీజేపీ నేత ఖుష్బూ సుందర్(Khushbu sundar) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘రెండో తరగతి విద్యార్థి(Class 2 boy) రాసిన లేఖకు ప్రధాని మోదీ జవాబిచ్చారు. నాయకత్వ లక్షణం అంటే ఇదే.. ఇలాంటి చిన్న చిన్న చర్యలతో చిన్నారులు సక్రమమార్గాల్లో పయనిస్తారు.’’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ప్రధాని లేఖ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ మానవతావాది, వినయశీలి అంటూ నెటిజన్లు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇక ప్రధాని మోదీకి లేఖ రాసేలా ఆరుష్‌ను ప్రోత్సహించిన అతడి తల్లిదండ్రులనూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-02-19T18:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising