Dark Neck: మెడ నల్లగా మారిపోతోందా..? ఇంట్లో దొరికే వీటిని వాడండి చాలు.. మందులు వాడకుండానే బిగ్ రిలీఫ్..!
ABN, First Publish Date - 2023-09-11T16:19:05+05:30
మెడ భాగంలో నలుపు వదిలించుకోవడానికి ఎన్నెన్నో చిట్కాలు ట్రై చేస్తుంటారు. కొందరు మందులూ ఉపయోగిస్తారు. కానీ కింది చిట్కాలతో నలుపంతా వదిలిపోయి చర్మం మెరుస్తుంది.
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ శరీరంలో కొన్ని ప్రాంతాల మీద అంత శ్రద్ద పెట్టకపోవడం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. అలాంటి ప్రాంతాలలో మెడ కూడా ఒకటి. మగాళ్లకు హెయిర్ క్రాఫ్ కారణంగానూ, అతిగా పుట్టే చెమట కారణంగా మెడ భాగంలో నలుపు పేరుకుపోతే.. మహిళలకు కొన్ని రకాల ఫ్యాషన్ ఆభరణాల కారణంగా మెడ భాగంలో చర్మం నలుపెక్కుతుంది. ఇది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తూ నలుగురిలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు అన్నీ ప్రయోగించి విసిగిపోయి ఆ తరువాత వైద్యులను ఆశ్రయిస్తుంటారు. కానీ ఏ మందులు అక్కర్లేదు. మెడ భాగంలో నల్లగా ఉన్న చర్మాన్ని తిరిగి సాధారణం చేయడానికి పసుపును నాలుగు రకాల పదార్థాలతో కలిపి ఉపయోగించడం ద్వారా అద్భుతం చేయవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
పసుపు, నిమ్మకాయ.. (Lemon, turmeric)
నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది పసుపుతో కలిసి మెడ నలుపు వదిలించడంలో అద్బుతంగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా పసుపు తీసుకోవాలి. నిమ్మకాయను రెండు సమాన ముక్కలుగా కట్ చేసి అర నిమ్మ చెక్కను పసుపులో అద్ది దీన్ని మెడ భాగంలో సున్నితంగా రుద్దాలి. పసుపును మూడు నాలుగు సార్లు అద్దుకుంటూ మెడమీద రుద్దాలి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ మెడ చర్మం నలుపు తొలగించడంలో ప్రభావం చూపిస్తుంది.
ATM Theft: వెబ్ సీరీస్‌లు చూసి దొంగలూ అప్‌డేట్ అయిపోయారుగా.. ఈ ఏటీఎంను ఎలా చోరీ చేశారో చూస్తే..!
పసుపు, ఓట్స్.. (oats, turmeric)
ఈ మధ్య స్క్రబ్ కోసం బాగా ఉపయోగిస్తున్న పదార్థం ఓట్స్. మచ్చలేని ముఖానికి ఓట్స్ స్క్రబ్ మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. ఇదే విధంగానే మెడ చర్మం నలుపు తొలగించడంలో కూడా ఓట్స్ ప్రభావవంతంగా ఉంటుంది. రెండు స్పూన్ల ఓట్స్ లో ఒక స్పూన్ పెరుగు వేయాలి. ఇందులో పుసుప కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడ చర్మం మీద, నల్లటి మచ్చలున్న ప్రాంతంలోనూ అప్లై చేయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత మెల్లిగా చేతులతో మసాజ్ చేస్తూ స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే మెడ చర్మం నలుపు చాలా ఈజీగా వదిలిపోతుంది.
క్యారెట్, పసుపు.. (carrot, turmeric)
నిగనిగలాడే చర్మం కోసం క్యారెట్ తినవచ్చు, దీన్ని ఫేస్ ప్యాక్ లా కూడా వాడచ్చు. మొదట క్యారెట్ తురిమి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చెయ్యాలి. ఆ తరువాత అందులో రెండు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల శనగపిండి, అరచెంచా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడ మీద అప్లై చేయాలి. సుమారు 15నిమిషాలు అలాగే ఉంటి ఆ తరువాత సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే చర్మం నలుపు రంగు , నల్లటి చారలు, మచ్చలు క్రమేణా వదిలిపోతాయి.
పసుపు, శనగపిండి.. (Gram flour, turmeric)
చాలామంది శనగపిండిని ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు. మరికొందరు సబ్బుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు. శనగపిండి చర్మానికి మెరుపును ఇస్తుంది. శనగపిండిలో కొద్దిగా పసుపు వేసి రోజ్ వాటర్ కలుపుతూ పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని మెడ నలుపు ప్రాంతంలో ప్యాక్ లా వేయాలి. 10 నుండి 15 నిమిషాల తరువాత సున్నితంగా స్క్రబ్ చేస్తూ తొలగించాలి. ఇలా చేస్తే మెడ ప్రాంతంలో పేరుకున్న నలుపు, మృత చర్మం క్రమంగా తొలగిపోతుంది.
Cow vs Snake: ఈ పామును ఆవు తినేసిందా..? లేక సర్పమే ఆవును కాటేసిందా..? ఏం జరిగిందో మీరే చూడండి..!
Updated Date - 2023-09-11T16:22:42+05:30 IST