Script Bank: వినూత్న ఆలోచన.. దేశంలోనే తొలి కథల బ్యాంక్..
ABN, First Publish Date - 2023-02-12T11:49:45+05:30
మనీ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్.. ఇలా ఎన్నో రకాల బ్యాంకులు ఉన్నాయి. వీటిలో డబ్బుల నుంచి రక్తం వరకు దొరకుతాయి.
మనీ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్.. ఇలా ఎన్నో రకాల బ్యాంకులు ఉన్నాయి. వీటిలో డబ్బుల నుంచి రక్తం వరకు దొరకుతాయి. వాటివల్ల ఎంతోమంది ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారు. తాజాగా మరో వినూత్నమైన బ్యాంక్ ప్రారంభమైంది. అదే స్క్రిప్ట్ బ్యాంక్ (Script Bank). ఈ బ్యాంకులో కథలు దొరుకుతాయి. అవును.. నిజమే. దేశంలోనే మొదటి ‘స్క్రిప్ట్ బ్యాంక్’ని ‘స్క్రిప్ట్ టిక్’ (Script Tick) పేరుతో ప్రముఖ తమిళ గీత రచయిత మదన్ (Madhan), నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధనుంజయన్ (Dhananjayan) కలిసి స్థాపించారు. ఈ బ్యాంకును ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathi Raja) తాజాగా ప్రారంభించారు.
ప్రతిభావంతులైన రచయితల కథలను చదివి వాటిలో మంచి స్టోరీలను ఎంపిక చేస్తారు. అనంతరం చిత్ర నిర్మాణానికి సిద్ధం చేసి దర్శక నిర్మాతలకు అందించేందుకు ఈ బ్యాంక్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇటీవల వస్తున్న సినిమాల్లో సరైన కథ, కథనాలు ఉండట్లేదని, అందుకే ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్‌గా మిగులుతున్నాయన్నారు. అందుకే ప్రతిభావంతులైన కొత్త కథా రచయితలు, దర్శకులు, నిపుణులు అందించిన కథలతో సినిమాలు ఆదరణ పొందే అవకాశం ఉందని ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా.. ఈ స్క్రిప్ట్ బ్యాంక్ సంబంధిచిన ఫొటోలను ఓ సినీ విమర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
#Thalapathy67: విజయ్, లోకేశ్ సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా..
Prabhas - Kriti Sanon Engagement: మాల్దీవుల్లో కృతితో నిశ్చితార్థం!?.. స్పందించిన ప్రభాస్ టీం
Updated Date - 2023-02-12T11:50:32+05:30 IST