ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Upcoming Smartphones in November 2023: మార్కెట్లోకి కొత్త ఫోన్లు.. నవంబర్ నెలలో లాంఛ్ అవబోతున్న స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదీ..!

ABN, First Publish Date - 2023-10-31T16:58:07+05:30

మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే అందుకు ఇదే సరైన సమయం. నవంబర్ నెలలో పలు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అవబోతున్నాయి. లావా, ఐక్యూ, వివో, రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి.

మీరు స్మార్ట్‌ఫోన్ (Smart Phones) కొనాలనుకుంటున్నారా? అయితే అందుకు ఇదే సరైన సమయం. నవంబర్ (November) నెలలో పలు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అవబోతున్నాయి. లావా, ఐక్యూ, వివో, రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. తక్కువ ధరలతో, ఎక్కువ ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి కొత్తగా విడుదల కాబోయే ఫోన్లు ఏంటో, వాటి ధరలు ఏ రేంజులో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం..

రియల్ మీ (Realme GT 5 Pro)

నవంబర్ రెండో వారంలో రియల్ మీ సంస్థ తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. Qualcomm Snapdragon 8 Gen 3తో సపోర్ట్‌తో, 6.78 అంగుళాల 1.5K కర్వ్డ్ డిస్‌ప్లేతో, 50MP టెలిఫోటో కెమేరాతో ఈ ఫోన్ రానుంది. 5400mAh బ్యాటరీని కలిగి ఉండే ఈ మొబైల్ 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి 40 వేల మధ్య ఉండొచ్చని అంచనా.

వన్ ప్లస్ 12 (OnePlus 12)

వన్‌ప్లస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 12 కూడా నవంబర్‌లోనే విడుదల కాబోతోంది. 6.82 అంగుళాల BOE X1 OLED డిస్‌ప్లేతో, 1Hz-120Hz LTPO రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ సూపర్ డిస్‌ప్లే క్వాలిటీని కలిగి ఉంది. Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్, 48MP అల్ట్రా వైడ్ మరియు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 5400mAh బ్యాటరీతో, 100W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ ధర రూ.50 నుంచి 80 వేల మధ్య ఉండొచ్చని అంచనా.

వివో X100 (Vivo X100)

Vivo X100 సిరీస్‌లో Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro ప్లస్ ఫోన్లు నవంబర్ 17వ తేదీన మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో, పెరిస్కోపిక్ జూమ్ కెమెరాతో ఈ మొబైల్స్ మార్కెట్లోకి రానున్నాయి. అలాగే వివో ఎప్పటిలాగానే మరికొన్ని ఫొటోగ్రఫిక్ స్టైల్స్‌ను యాడ్ చేయబోతోంది.

ఐక్యూ 12 (iQoo 12 5G)

iQoo 12, iQoo 12 Pro మొబైళ్లు నవంబర్ 7వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఫోన్ చైనాలో లాంఛ్ అవుతాయి.Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్, రెండు 50 50MP కెమెరాలు, మరో 64MP కెమెరా సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో రానుంది. అలాగే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

లావా బ్లేజ్ 2 (Lava Blaze 2 5G)

లావా బ్లేజ్ 2 మొబైల్ ఫోన్ నవంబర్ 2 మధ్యాహ్నం 12 గంటలకు లాంఛ్ అవుతుంది. ఫోన్ బాక్సీ డిజైన్, వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. MediaTek Dimension 6020 చిప్‌సెట్, ఫోన్ 6 GB RAM, 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ మొబైల్ ధర రూ.10 వేలు ఉంటుందని అంచనా.

Updated Date - 2023-10-31T16:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising