ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది బాబును ఆస్పత్రికి తీసుకొచ్చిందో తల్లి.. పిల్లాడి పొట్టపై గాయాలను చూసి వైద్యులు నిలదీస్తే ఆమె చెప్పింది విని..

ABN, First Publish Date - 2023-02-17T17:35:32+05:30

ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న ఏడాదిన్నర కొడుకు విషయంలో ఓ తల్లి చేసిన పని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అయితే అవగాహన లేక మూఢత్వంతో కొందరు పిచ్చిపనులు చేస్తుంటారు. ఊపిరి ఆడక శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఏడాదిన్నర కొడుకు విషయంలో ఓ తల్లి చేసిన పని దారుణానికి దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలలోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లా అర్జియా ప్రాంతంలో ధర్మేంద్ర అనే వ్యక్తి నివసిస్తున్నాడు అతనికి ఏడాది వయసు కొడుకు ఉన్నాడు. ఆ బాబు పేరు కార్తీక్. కార్తీక్ నెల రోజుల నుండి ఊపిరి సరిగ్గా ఆడక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో 'అయ్యో పిల్లాడికి ఏమవుతుందో ఏమో.. ఏదో ఒకటి చెయ్యాలి' అని ఆ తల్లి కూడా విలవిలలాడింది. అంతలోనే ఆమెకు చిన్నతనంలో తమ పెద్దలు చేసే వైద్యం గుర్తొచ్చింది. వెంటనే ఒక సూది తీసుకుని వేడి చేసి బాబు కడుపుమీద వక్రాకారంగా వాత కాల్చింది. దీంతో బాబు సమస్య తగ్గిపోతుందనుకుంది ఆ అమాయకురాలు. కానీ ఆమె అనుకున్నదానికి సీన్ రివర్స్ అయ్యింది. బాబుకు సమస్య తగ్గకపోగా ఇంకా పెరిగింది. పరిస్థితి విషమంగా మారడంతో హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ లో డాక్టర్లు బాబును పరీక్షిస్తున్నప్పుడు కడుపు మీద వాత గాయాన్ని చూశారు. బాబుకు ఏమైంది ఈ గాయాలేంటని ఆరా తీసారు. తల్లి తను చేసిన నిర్వాకం అమాయకంగా చెప్పడంతో డాక్టర్లు షాక్ కు గురయ్యారు. తల్లిమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని బాబును పరిశీలించారు.

Also read: Viral Photo: మీ కంటి చూపునకు ఓ పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న సంఖ్య ఎంతో చెప్పగలరా..?


బాబును పరీక్షించిన వైద్యులు బాబు పోషకాహార లోపంతో ఉన్నాడని, దాంతో పాటు రక్తహీనత కూడా ఉందని తెలిపారు. అంతేకాకుండా బాబుకు న్యూమోనియా వచ్చినట్టు తెలిపారు. తల్లిదండ్రులు, గ్రామాలలో పెద్దవాళ్ళు తెలిసీ తెలియకుండా మూఢనమ్మకాలతో పిల్లలకు సొంత వైద్యం చేసి ప్రాణాలమీదకు తెస్తున్నారని, అలాంటి పనులు చేయకుండా వారికి అవగాహన కలిగించే దిశగా కౌన్సిలింగ్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం బాబుకు వైద్యం కొనసాగుతోంది.

Updated Date - 2023-02-17T17:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising