ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme Court: నాకు డైవర్సీగా చనిపోవాలని లేదు.. 82 ఏళ్ల వృద్ధురాలి అభ్యర్థన.. కోర్టు తీర్పు ఏంటంటే..

ABN, First Publish Date - 2023-10-13T18:17:08+05:30

89 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన డైవర్స్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా తోసిపుచ్చింది. తనకు డైవర్సీగా మరణించాలని లేదని ఆయన భార్య వేడుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం మహిళకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. భర్త బాగోగులు చూసుకునేందుకు తాను సిద్ధమంటూ మహిళ పేర్కొన్న విషయాన్ని కూడా కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఇంటర్న్ డెస్క్: ఆ పెద్దాయనకు ఏకంగా 89 ఏళ్లు. ఆయన భార్యకు 82 ఏళ్లు. తనకు విడాకులు ఇప్పించాలంటూ పెద్దాయన కోర్టును ఆశ్రయించారు. తమ వివాహ బంధం కుప్పకూలిపోయిందని చెప్పారు. విడాకులు ఇప్పించండి కోర్టును వేడుకున్నారు. మరోవైపు, ఆయన భార్య మాత్రం విడాకులకు అంగీకరించలేదు. ఓ డైవర్సీగా తాను మరణించదలుచుకోలేదని వేడుకుంది. ఈ కీలక కేసులో సుప్రీం కోర్టు తాజాగా ముఖ్యమైన వ్యాఖ్యలు చేస్తూ తీర్పు వెలువరించింది.

Viral: నన్నేం చేయమంటారో మీరైనా చెప్పండి..నెట్టింట వ్యక్తి అర్థింపు.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌‌టాప్ ఆర్డరిచ్చాక..

పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ జంటకు 1963లో వివాహమైంది. భర్త ఆర్మీలో పనిచేసేవారు. వారికి ముగ్గురు సంతానం. అయితే, అప్పట్లో మద్రాస్‌లో విధులు నిర్వహించే ఆయనతో వెళ్లేందుకు భార్య ఇష్టపడలేదు. దీంతో, 1984 నుంచి వారి బంధం ఒడిదుడుకులకు లోనైంది. ఈ క్రమంలో మహిళ తొలుత అత్తమామలతో ఆ తరువాత కుమారుడి వద్ద ఉండటం ప్రారంభించింది.

Viral: కొడుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో రెచ్చిపోయిన తండ్రి.. పబ్లిక్‌గా అందరి ముందూ.. అతడి తప్పు ఏంటంటే..


ఈ క్రమంలో కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై జస్టిస్ అనిరుద్ధ బోస్, బేలా ఎమ్ త్రీవేది విచారణ జరిపి అక్టోబర్ 10న తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద వివాహ బంధం శాశ్వతంగా తెగిపోయిందన్న కారణంతో ఈ కేసులో విడాకులు మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. అన్ని సందర్భాల్లో ఒకే ఫార్మాలా వాడలేమని వ్యాఖ్యానించింది.

ఈ కాలంలో విడాకులు తీసుకునే వారి పెరుగుతున్నప్పటికీ భారత సమాజంలో వివాహా వ్యవస్థకు ఇప్పటికీ ఓ పవిత్రస్థానం ఉందని పేర్కొంది. వివాహమనేది భార్యాభర్తల మధ్య ఉన్న భావోద్వేగపూరిత బంధమని వ్యాఖ్యానించింది. భర్త బాగోగులు చూసుకునేందుకు తాను సిద్ధమని, ఈ వయసులో డైవర్సీగా చనిపోదలుచుకోలేదన్న భార్య వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేస్తే ఇరు వర్గాలకు పూర్తి న్యాయం జరగదని అభిప్రాయపడింది. ఈ మేరకు భర్త పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం.. ఏ వ్యవహారంలోనైనా వ్యక్తులు లేదా పిటిషనర్లకు న్యాయం జరిగేలా తగు తీర్పు వెలువరించే ప్రత్యేకాధికారం సుప్రీం కోర్టుకు ఉంది.

Shocking: 13 మంది అమ్మాయిలతో నగ్నంగా డాన్సులు వేయించిన వ్యాపారవేత్త.. అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు..!

Updated Date - 2023-10-13T18:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising